దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకూ ఉంటుంది అనేది తెలిసిందే ..కేంద్రం చెప్పిన దాని ప్రకారం ప్రధాని పిలుపుతో కచ్చితంగా దేశం అంతా మే 3 వరకూ లాక్ డౌన్ పాటించాలి, అయితే దేశంలో కొన్ని గ్రీన్ జోన్ ఏరియాలు ఉన్నాయి, ఒక్క వైరస్ కేసు నమోదు కాని జిల్లాలు ఉన్నాయి ..అయితే వారికి కాస్త వెసులుబాటు ఇవ్వాలి అని వారు కోరుతున్నారు.
ఈ సమయంలో అక్కడ వారికి ఉపాధికి పనులకి ఆటంకం ఉండకుండా జిల్లాలు దాటకుండా వారి పనివారు చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది కొందరి ఆలోచన, అయితే ఇలాంటి జోన్ల విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయని తెలుస్తోంది.
తాజాగా కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఏప్రిల్ 20 వరకు తెలంగాణలో లాక్‌డౌన్‌ను కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆ తర్వాత పరిస్థితిని బట్టి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఇక తెలంగాణలో 20 తర్వాత కాస్త వైరస్ ఫ్రీ ఉన్న జిల్లాల్లో కొంచెం సడలింపు ఉంటుంది అని తెలుస్తోంది. ఈ నెల 20 న కేసీఆర్ చెప్పే అవకాశం ఉంటుంది అంటున్నారు.