ఏ తల్లి దండ్రులు అయినా పిల్లలని ఎంత ప్రేమగా చూసుకుంటారో తెలిసిందే.. తను తినేది కూడా పిల్లలు ఆకలి అంటే ఇస్తుంది తల్లి.. అయితే కొందరు తల్లిదండ్రులు పిల్లలపై దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు… తాజాగా ఓ తల్లి చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు.. ఆమె పిల్లల విషయంలో ఏం చేసిందంటే.
వారి మూత్రాన్ని వారికే తాగిస్తోంది ఈ తల్లి… తాను కూడా తన మూత్రాన్ని తాను తాగుతూ పిచ్చ పని చేసింది… ఎందుకు అంటే మూత్రం తాగితే కరోనా వైరస్ సోకదనే ప్రచారం జరిగింది, లండన్ లో ఓ మహిళ ఈ విషయం చదివింది… ఈ వార్త నిజం అని భావించింది… దీంతో గత కొద్ది రోజులుగా ఉదయాన్నే ఆమె తన మూత్రాన్ని తాగడం మొదలుపెట్టింది.
అంతటితో ఆగలేదు తనతో పాటు తన పిల్లల మూత్రం కూడా వారితో తాగించింది… ఇక ఇలా చేయడం వల్ల పిల్లలకు జ్వరం వచ్చి ఇబ్బందిపడ్డారు.. వెంటనే ఆస్పత్రికి తీసుకువచ్చింది వైద్యులు అన్నీ ప్రశ్నిస్తే అసలు నిజం చెప్పింది… దీంతో అక్కడ సీనియర్ వైద్యులు మీడియా ముఖంగా ఇది చెప్పారు.. ఇలాంటి ఆలోచన చేయకండి అని మూత్రం తాగితే కరోనా రాదు అనేది పూర్తి అవాస్తవం ఫేక్ న్యూస్ అని తెలిపారు.