తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం ఓరేంజ్ లో సాగుతోంది.. అభ్యర్దులు పార్టీల అధినేతలు ఓ రేంజ్ లో ప్రచారం
చేస్తున్నారు.. ఇక ఇప్పటికే చాలా మంది ప్రచారంలో జోరు పెంచారు, ఇక అనేక హామీలు ఇస్తున్నారు, ఇక రాజీకయ పార్టీలు ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలి అని మేనిఫెస్టోలో అనేక కొత్త హామీలని ఇచ్చాయి, అయితే ప్రజలు మాత్రం ఏ పార్టీ వైపు ఉంటారు అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.
అయితే రాజకీయ పార్టీలు సరే మరి ఇండిపెండెంట్లు కూడా తమదైన శైలిలో ఎన్నికల హామీలు ఇస్తున్నారు.. ఇవి కూడా వైరల్ అవుతున్నాయి, తమిళనాడులోని దక్షిణ మధురై నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న శరవరణ్ అనే వ్యక్తి.. తన నియోజకవర్గం కోసం స్పెషల్ మేనిఫెస్టోను తయారు చేశారు. ఇవి ప్రపంచంలో ఎవరూ ఇవ్వని హమీలు అనే చెప్పాలి.
తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలందరిని బ్యాచ్ ల వారీగా చంద్రమండలానికి తరలించడం.. ఇక్కడ రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేస్తారట, ఇక ఇంట్లో ఆడవారికి పనులకు సాయం కోసం ఇంటికి రోబో ఇస్తారట
మధురైలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కాలువలు తవ్వించడమే కాకుండా.. ఇంటికో బోటు ఇస్తారట.ఇక్కడ ఎండ వేడి ఎక్కువ కాబట్టి కృత్రిమ మంచు కొండ ఏర్పాటు చేస్తారట, కృత్రిమ బీచ్ ఏర్పాటు చేసి ప్రజలు సేద తీరేందుకు ఏర్పాటు చేస్తారట.
నియోజకవర్గ ప్రజలందరికీ ఐఫోన్ కూడా ఇస్తారట, మరి ఇవన్నీ విని అందరూ షాక్ అవుతున్నారు, మిగిలిన పార్టీల నేతలు కూడా ఇవేం హామీలు అంటున్నారు.. మరి ఇవన్నీ చేయాలి అంటే దేశ బడ్జెట్ కూడా సరిపోదేమో అంటున్నారు జనం.
|
|
ఇంటికి ఓ రోబో – కృత్రిమ సముద్రం – తమిళనాడులో సరికొత్త హామీలు
-