ఆరోజు మళ్లీ వస్తా వైసీపికి మరో టెన్షన్ రేపిన పవన్ కల్యాణ్

ఆరోజు మళ్లీ వస్తా వైసీపికి మరో టెన్షన్ రేపిన పవన్ కల్యాణ్

0
87

అమరావతిలో రైతులు దీక్షలు ఆందోళనలు ఉద్యమాలకు 50 రోజులు పూర్తి అయ్యాయి, అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ సమయంలో వారికి వెన్నంటి ఉన్నారు, కచ్చితంగా రాజధాని తరలింపు జరగదని మీకు హమీ ఇస్తున్నాను అని రైతులకి వెన్నంటి ఉన్నారు, అయితే ఇప్పటికే జనసేన తరపున కమిటీ వెళ్లింది.. అలాగే అక్కడ రాజధాని రైతుల దగ్గరకు వెళ్లి వారికి మద్దతు ప్రకటించారు పవన్.. అక్కడ రైతులకి మద్దతు తెలిపారు

ఇక బీజేపీ జనసేన కలిపి రాజధాని రైతుల విషయంలో వారికి న్యాయం చేయాలి అని కలిసి పోరాడుతున్నాయి..తాజాగా దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు.. రైతులు, ఆడపడచుల స్ఫూర్తి చూసి తెలుగువాళ్లు గర్విస్తున్నారని అన్నారు. రోడ్డునపడ్డ రైతులకు అండగా ఉంటానని గతంలోనే మాటిచ్చానని, ఈ నెల 10 తర్వాత మరోసారి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని చెప్పారు. దీనిపై జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రైతుల వాణి దేశం నలుమూలలా వినిపించేలా చేస్తామని అన్నారు పవన్ , రైతుల ఉద్యమానికి మరోసారి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు చెప్పారు. అయితే పవన్ తో బీజేపీ నేతలు వస్తారా లేదా అనేది చూడాలి.. గతంలో పవన్ రాజధాని ప్రాంతంలో పర్యటించిన సమయంలో కాస్త హైటెన్సన్ నెలకొంది మరి ఈసారి పరిస్దితి ఎలా ఉంటుందో చూడాలి.