భారత్ చైనా బోర్డర్ లో జరిగిన ఘర్షణలో మన సైన్యం కొందరు వీర మరణం పొందారు, ఇందులో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందారు ఈ ఘర్షణలో.. ఆయన తన వర్క్ పై ఎంతో కమిట్ మెంట్ తో పని చేసేవారు, ఇక సరిహద్దు దగ్గర విషయాలు ఎలా ఉంది అనేది కూడా కుటుంబానికి ఎప్పుడు చెప్పరు.
అది జూన్ 14 రాత్రి 10 అయ్యింది. త్వరలోనే సూర్యాపేటలోని ఇంటికి వెళ్లాలనుకున్న కల్నల్ సంతోష్ బాబు… బోర్డర్ నుంచి తమ వారికి కాల్ చేశాడు. ఈ సమయంలో తన కుటుంబ సభ్యులు అక్కడ ఎలా ఉంది చైనా బోర్డర్ లో పరిస్దితి ఏమిటి అని అడిగారు
దానికి ఆయన ఏ సమాధానం చెప్పలేదు, మీరు ఇవి నన్ను ఇలా అడగకూడదు నేను ఇంటికి వచ్చిన సమయంలో చెబుతాను అన్నాడు, దీంతో ఆయన ఎంత డెడికేషన్ తో ఉంటారో తెలుస్తోంది, ఒకవేళ ఆయన ఫోన్ ట్యాంపరింగ్ చేస్తే ఇక్కడ విషయాలు లీక్ అవుతాయని ఆయన ఇలా చేశారు, ఇది నిజమైన సైనికుడి లక్షణం, నిజంగా ఆయనకు సెల్యూట్ చేయాల్సిందే ఆయనకు అశ్రునివాళి అర్పిద్దాం.