పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీకి గట్టి షాక్ తగిలింది. నందిగ్రామ్ లో జరిగిన సహకార సంఘం ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. గతంలో ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉండేది. కానీ తాజాగా 12 స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 11 స్థానాల్లో గెలిచింది. తృణమూల్ కాంగ్రెస్ ఒక్క సీటుకే పరిమితం అయింది.