ఆ విషయంలో చంద్రబాబును ఫాలో అవుతున్న పవన్…

ఆ విషయంలో చంద్రబాబును ఫాలో అవుతున్న పవన్...

0
95

కొత్త రాజకీయాల్లోకి వచ్చిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే బాగా అర్ధం అయిపోయిందని అంటున్నారు విశ్లేషకులు…. అందుకే కొద్దికాలంగా సింగిల్ విండోనే తెరచి మరీ ఏపీ వైపు చూపు పెట్టారని అంటున్నారు… ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడో పండిపోయారు.. ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకనాటి శిష్యుడు కాదని తనకంటే నాలుగాకులు ఎక్కువే చదివాడని 2015 నాటికే అర్ధం అయిపోయింది…

అందుకే రాత్రికి రాత్రే తట్టా బుట్టా సర్దేసుకుని అమరావతికి వచ్చారు… ఇక అప్పటినుంచి చంద్రబాబు నాయుడు కేసీఆర్ మీద ఒక్క విమర్శ చేసి ఉంటే ఒట్టు…కేసీఆర్ కి భయపడి బాబు తన పార్టీని కూడా తెలంగాణలో విలేసుకున్నారని అంటారు… ఇది చాలు కేసీఆర్ కి… ఇక ఎంతసేపు ఏపీ మీదనే పడుతూ తన రాజకీయ అనుభవాన్ని అంతా రంగరిస్తున్న బాబుకు పవన్ శిష్యుడు తోడు అయ్యారులా ఉంది….

ఈమాట అన్నది సొంత బావమరిది బాలయ్యే కాబట్టి ఆసినీ డైలాగునే బట్టి పట్టి మరీ చంద్రాబు నాయుడు ఏపీ వైపు చూస్తూ బీపి పెంచేసుకుంటున్నారు… ఇంతకు మించిన రాజకీయం సమస్యలు ఉన్నా కూడా ఆయన తెలంగాణ వైపు అసలు తొంగిచూడలేదు…