పిల్లలను తల్లి దండ్రులు ఎంతో ప్రేమగా చూసుకుంటారు.. ఎలాంటి ఆపద వచ్చినా వారిని తమ ప్రాణాలు అడ్డుపెట్టి మరీ కాపాడుకుంటారు, అయితే అమెరికాలో ఓ తల్లి తన కుమార్తె విషయంలో ఇలాంటి పనే చేసింది.అమెరికాలోని టెక్సాస్లో పెల్లీస్ పెనా అనే మహిళ ఉదయం సరుకులు తీసుకురావడానికి బయటకు వెళ్లింది.. ఈ సమయంలో జానే హాకిన్స్ అనే 19 ఏళ్ల యువకుడు.
బెడ్రూమ్ కిటికీ నుంచి తొంగి చూడటం మొదలుపెట్టాడు. ఎందుకు అంటే పెనా కుమార్తె ఆ రూమ్ కు వస్తుంది అనే ఆలోచనతో..ఈ లోగా పెనా అక్కడికి చేరుకుంది. వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేసింది వారు వచ్చేశారు, ఈలోపు పోలీసులని చూసి జానే అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు.
పెనా అతడికి అడ్డంగా పరిగెట్టి కిందపడేసింది. అతనిని ముందుకు కదలకుండా చేశారు తల్లి కూతురు, దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతని జేబులో మత్తు పదార్దాలు ఉండటం కూడా గుర్తించారు. ఈ వీడియో మీరు చూడండి.