ఆ జిల్లాకు ఎన్టీఆర్ పేరు…

ఆ జిల్లాకు ఎన్టీఆర్ పేరు...

0
89

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో వచ్చినప్పటినుంచి అనేక అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నారు… ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నారు.

అందులో భాగంగా తాము అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాను ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెడతామని జగన్ ప్రకటించారు… ఇటీవలే కేబినేట్ లో నూతన జిల్లా ఏర్పాటుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే… దీనిపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ…

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ పేరు పెడతామని స్పష్టం చేశారు.. అయితే ఇప్పుడు విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెడతారా లేక మచిలీపట్నంకు ఎన్టీఆర్ పేరు పెడతారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న…