పవన్ కల్యాన్ కు రాపాక వరప్రసాద్ కు మధ్య గ్యాప్ ఎక్కడ వచ్చింది..అవును పవన్ వ్యాఖ్యలు ఒకలా ఉంటే ఇటు రాపాక వ్యాఖ్యలు వేరుగా ఉంటున్నాయి… సీనియర్లు జూనియర్ల మధ్యన వివాదాస్పద ఘర్షణలు జరగడం తెలిసే ఉంటాయి.. అయితే పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఆయన ఒక్కరే ఇక పవన్ కూడా ఆయనతోనే రాజకీయంగా ముందుకు వెళ్లాలి. మరి ఇద్దరి మధ్య వివాదం ఏమిటి అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది.
ఇక ఏపీలో ఇంగ్లీష్ మీడియం విద్యకి కూడా వరప్రసాద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. జగన్ చేసే పని మంచిదే అన్నారు.. జనసేన పార్టీతోనూ తనకు కాస్త కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని, పవన్ కల్యాణ్ కు, తనకు మధ్య అడ్డంకి ఉందని వ్యాఖ్యానించారు. త్వరలోనే పవన్ కు తనకు మధ్య ఉన్న అడ్డంకి తొలగిపోతుందని అన్నారు.
మరి ఎందుకు ఆయనకు ఈ గ్యాప్ వచ్చింది.. గతంలో నాదెండ్ల ఎపిసోడ్ రాపాక ఎపిసోడ్ సోషల్ మీడియాలో కూడా చర్చ జరిగింది .. మీటింగ్ కు ఆలస్యంగా వస్తారా అనే అంశం పై, తాజాగా మరి పార్టీలో ఆయనకు వ్యతిరేక వర్గం ఉందా అని అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు.