ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాకుండా చేసేందుకు పక్కా ప్లాన్…

ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాకుండా చేసేందుకు పక్కా ప్లాన్...

0
73

రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అయిన కాపు రామచంద్రారెడ్డిపై ఒక వర్గం వ్యూహాత్మకంగా విష ప్రచారాన్ని చేస్తూ మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటోందన్న చర్చ స్థానికంగా వినిపిస్తున్నాయి… గత కొన్ని రోజులుగా బొమ్మనహల్ హీరెహల్ మండలాలకు చెందిన ఒక వర్గం కాపు రామచంద్రారెడ్డి పై లేనిపోని నిందలు వేసి దుష్ప్రచారానికి పాల్పడుతున్నట్లు సమాచారం…

ఆయనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకునేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు కొందు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు… ఈ కుట్రలో భాగంగా కర్నాటకలోని బళ్లారికి చెందిన కొంతమంది రాజకీయ ప్రముఖులతో కూడా సదరు వర్గీయులు మంతనాలు జరిపారన్న వాదనలు వినపడుతున్నాయి…

స్థానికంగా కొంతమంది దందాలకు ఆయన అడ్డుపడుతుండటంవల్లే ఇలాంటి దుర్మార్గాలకు తెరతీసినట్లు వార్తలు వస్తున్నాయి… ఈ వర్గానికి టీడీపీకి చెందిన కొంత మంది నేతలు కూడా సహాయక సహకారాలను అందిస్తున్నట్లు స్థానికులు భావిస్తున్నారు…. గతంలో టీడీపీ నాయకులు చేసిన తప్పులను కూడా రామచంద్రారెడ్డి పై నెట్టేయడం జరుగుతోందని ఆయన వర్గీయులు మండిపడుతున్నారు…