తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు… తాజాగా యాదగిరి గుట్టలో ఆయన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు… అయితే బైక్ ర్యాలీకి ఇక్కడ అనుమతి లేదని చెప్పడంతో భూవణగిరిలో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు…
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేసీఆర్ బీజేపీ అంటే భయపడుతున్నారని రాజాసింగ్ అన్నారు… ఇంటింటికి మంచినీళ్లు అందించకపోతే ఓట్లే అడగమని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఏముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు…
టీఆర్ ఎస్ పార్టీకి ఓట్లు వేస్తే ఏమాత్రం అభివృద్ది జరగదని అన్నారు… అలాగే పోలీసులపై కూడా ఆయన ఫైర్ అయ్యారు… టీఆర్ఎస్ గెలిపించేందుకు పోలీసు బ్రోకరిజం చేస్తున్నారని ఆరోపించారు… పోలీసులకు టీఆర్ఎస్ బాధ్యతలు అప్పగించడం వల్లే వారు బీజేపీ కార్యకర్తలను బెధిరిస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు..