ఆధార్ కార్డ్ ఉన్న వారు ఈ రెండు సర్వీసులు ఇక ఉండవు తెలుసుకోండి

Aadhaar card Holders will no longer have these two services

0
41

ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరికి ఆధార్ కార్డ్ ఉంటోంది. ముఖ్యంగా ఆధార్ ఉన్న వారు తాజాగా వచ్చిన రెండు కొత్త అంశాలు తెలుసుకోవాలి. యూఐడీఏఐ తాజాగా కొన్ని సర్వీసులు నిలిపివేసినట్లు ప్రకటించింది. యూఐడీఏఐ నిర్ణయంతో ఆధార్ కార్డు కలిగిన వారిపై ప్రభావం పడనుంది. మరి ఆ సర్వీసులు ఏమిటో చూద్దాం.

ఆధార్ కార్డులో అడ్రస్ వాలిడేషన్ లెటర్ ద్వారా అడ్రస్ మార్చుకోవడం ఇక సాధ్యం కాదు. అలాగే ఆధార్ కార్డు రీప్రింట్ సేవలు కూడా అందుబాటులో ఉండవు. ఇప్పటి వరకూ ఆధార్ కార్డును రీప్రింట్ చేసుకోవడం కుదిరేది ఇక అది కుదరదు. అడ్రస్ వాలిడేషన్ లెటర్ ఆప్షన్ తొలగించడం వల్ల అద్దెకు ఉంటున్న వారికి కాస్త ఇబ్బంది ఉంటుంది.

ఇక మీ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోతే ఇక పై అడ్రస్ మార్చుకోవడం కష్టం. ఒకవేళ ఆధార్ రీప్రింట్ పొందాలని భావించే వారు పీవీసీ కార్డు రూపంలో మాత్రమే ఆధార్ కార్డు పొందాల్సి ఉంటుంది. ఇక మీరు ఎప్పుడైనా ఆధార్ కార్డులో తప్పులు ఉంటే మార్చుకోవచ్చు.మొబైల్ నెంబర్ యాడ్ చేసుకోవడం, బయోమెట్రిక్ అప్డేట్ కోసం మీరు ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిందే.