ఆధార్ తో పాన్ కార్డ్ లింక్ చేయలేదా 48 గంటలే సమయం ఇలా చేసుకోండి పూర్తి లింక్

ఆధార్ తో పాన్ కార్డ్ లింక్ చేయలేదా 48 గంటలే సమయం ఇలా చేసుకోండి పూర్తి లింక్

0
85

పాన్ కార్డుతో మీ ఆధార్ కార్డును లింక్ చేసుకున్నారా, లేదా అయితే వెంటనే చేసుకోవాలి.. లేదంటే ఆది క్యాన్సిల్ అవుతుంది. పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానానికి మరో రెండు రోజులు మాత్రమే ఉంది. పాన్తో ఆధార్ లింక్కు గతంలో చాలా సార్లు గడువు పొడిగిస్తూ వచ్చిన కేంద్రం ప్రభుత్వం… ఈసారి డిసెంబర్ 31 తరువాత గడువు పొడిగించేది లేదని స్పష్టం చేసింది. మరి ఎన్నారైలు కూడా కచ్చితంగా చేసుకోవాలి.. లేదంటే మీరు బ్యాంకులో నగదు డిపాజిట్ చేయడానికి కుదరదు ..బంగారం కొనుగోలు చేసినా మీ పాన్ నెంబర్ పనిచేయదు, క్రయ విక్రయాలకు ఇది చెల్లుబాటు కాదు.. మీ పాన్ కార్ట్ క్యాన్సిల్ అవుతుంది.

వాస్తవంగా చెప్పాలి అంటే ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 139ఏఏ ప్రకారం పాన్ కార్డును రద్దు చేస్తారు. మరి ఇంకా లింక్ చేసుకోలేని వారికి మేము ఆ వెబ్ సైట్ లో ఆ సైల్ లింక్ ఇస్తున్పాము.. మరి మీరు ఎలా లింక్ చేసుకోవాలో కూడా చెబుతాము.. ముందుగా కింద ఉన్న ఈ లింక్ క్లిక్ చేయండి

https://www.incometaxindiaefiling.gov.in/home

ఈ వెబ్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత …లెఫ్ట్ సైడ్ లింక్ ఆధార్ కనిపిస్తుంది… దానికి క్లిక్ చేస్తే ఈ పేజీ ఓపెన్ అవుతుంది

https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/LinkAadhaarHome.html?lang=eng

అందులో మీ ఆధార్ నెంబర్ మీ పాన్ నెంబర్ ఎంటర్ చేసి కాప్చ్ కోడ్ ఎంటర్ చేసి… కింద లింక్ ఆధార్ క్లిక్ చేస్తే, మీ ఆధార్ పాన్ లింక్ అవుతుంది. మరి మీరు ఓసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే కేవలం 48 గంటలు మాత్రమే సమయం ఉంది.