అచ్చెన్నాయుడు అరెస్ట్ పై లోకేశ్ రియాక్షన్…

అచ్చెన్నాయుడు అరెస్ట్ పై లోకేశ్ రియాక్షన్...

0
86

శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ నేత లోకేశ్ ఆరోపించారు…. కక్ష సాధింపులో భాగంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బీసీ నేత అచ్చెన్నాయుడు ని అరెస్ట్ చేయించారని మండిపడ్డారు… ఏడాది తుగ్లక్ పాలనలో జరుగుతున్న అరాచకాలను, అన్యాయాలను బయటపెట్టినందుకే అచ్చెన్నాయుడు పై జగన్ పగ పట్టారని ఆరోపించారు…

బీసీ లకు జగన్ చేస్తున్న అన్యాయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించినందుకు ఆయన పై వ్యక్తిగత దూషణలకు దిగి జగన్ రాక్షస ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు… లక్ష కోట్లు కొట్టేసి 16 నెలలు ఊచలు లెక్కపెట్టిన జగన్ అందర్నీ జైలులో పెట్టాలనుకోవడం సహజమే అని అన్నారు..

రాజారెడ్డి రెడ్డి రాజ్యాంగం అమలులో ఉంది ఇష్టం వచ్చినట్టు ఎవరినైనా అరెస్ట్ చేస్తానని జగన్ మోహన్ రెడ్డి అనుకుంటున్నారు… బడుగు,బలహీన వర్గాలకి రక్షణగా అంబేద్కర్ రాజ్యాంగం ఉందనే విషయం జగన్ గుర్తెరిగితే మంచిదని అన్నారు