Vijay | తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త పార్టీ ప్రకటన

-

తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. స్టార్ హీరో, దళపతి విజయ్‌ (Vijay) ‘తమిళగ వెట్రి కజగం(Tamizhaga Vettri Kazhagam)’ పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ పెట్టినట్లు తెలిపారు. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కూడా స్పష్టంచేశారు. తమ హీరో రాజకీయాల్లోకి రావడంతో విజయ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -

ఇటీవల పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ ప్రచారం నిజం చేస్తూ కొత్త పార్టీ ప్రకటించారు. దీంతో తమ హీరోను ముఖ్యమంత్రిని చేసి తీరుతామని అభిమానులు చెబుతున్నారు. విజయ్(Vijay) పార్టీ ప్రకటన తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

Read Also: స్టేడియంలో నగ్నంగా తిరుగుతానన్న నటి మృతి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి...

జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: సీబీఐ

YS Jagan Foreign Tour | విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి...