ప్రభుత్వ ఆసుపత్రిలో అడిషనల్ కలెక్టర్ కు ప్రసవం

Additional Collector Childbirth in Government Gazette

0
89

ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించడం..అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడం లాంటివి చేయడం వల్ల సదుపాయాలు మెరుగవ్వడమే గాక, ప్రజలలో కూడా మంచి నమ్మకం కలిగించిన వారవుతారు. తాజాగా ఖమ్మం జిల్లాలో ఓ ప్రభుత్వ అధికారిని అలాంటి నిర్ణయమే తీసుకుంది.

సాధారణ వ్యక్తులే ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళుతున్న తరుణంలో ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి అందరికి ఆదర్శంగా నిలిచారు. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా సామాన్య మహిళలా ప్రభుత్వాసుపత్రికి వచ్చి టెస్టులు చేయించుకుంది. ఆ తర్వాత కలెక్టర్ స్నేహలతకు వైద్యులు అక్కడే డెలివరీ చేశారు. ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

ఇక ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. దాంతో అడిషనల్ కలెక్టర్ స్నేహలతపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వాసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని సామాన్య ప్రజలు మాట్లాడుకుంటున్నారు.