ఆధార్ కార్డు ఉన్న చాలా మంది ఇఫ్పుడు దీనిని ఐడెంటిటి అలాగే అడ్రస్ ఫ్రూఫ్ గా వాడుతున్నారు ..ఇక్కడ వరకూ అందరికి బాగానే ఉంది. దేశంలో ఎక్కడికి వెళ్లినా మన అడ్రస్ చేంజ్ చేసుకుంటాం. అయితే కొత్తగా ఏదైనా అప్లై చేసుకోవాలి అన్నా బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలి అన్నా కచ్చితంగా మీకు ఆధార్ కార్డు ఉండాల్సిందే. అయిత తాజాగా ఆధార్ పై కీలక ప్రకటన చేసింది ..బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్కు ఆధార్ కేవైసీ రూల్స్ను సవరించింది. దీంతో ఆధార్ కార్డులో అడ్రస్ మార్పు అసవరం ఉండదు.
మీరు ఒక ప్రాంతానికి ఉద్యోగం నిమిత్తం వెళితే మీరు అక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆధార్ అడ్రస్ అవసరం లేదు. ప్రస్తుత అడ్రస్ సెల్ఫ్ డిక్లరేషన్తో అకౌంట్ తెరవొచ్చు. ఇది కొత్త నిబంధన. ఇది ఇప్పటి వరకూ చాలా మందికి ఇబ్బందిగా ఉంది.. తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఇది ఉద్యోగులకు బాగా ఉపయోగపడుతుంది అని చెబుతున్నారు. అన్నీ బ్యాంకుల దగ్గర నోటీసుల్లో ఈ విషయాన్ని తెలియచేస్తున్నారు.
ఉదాహరణకు ఒక ఉద్యోగి భీమవరం నుంచి హైదరాబాద్ కు బదిలీ అయ్యాడు. అతని ఆధార్ కార్డులో అడ్రస్ భీమవరం ఉంది. ఈయన హైదరాబాద్ లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని భావిస్తే. హైదరాబాద్ ప్రస్తుత అడ్రస్ను సెల్ఫ్ డిక్లరేషన్ కింద ఇస్తే పని పూర్తవుతుంది. ఇక ప్రతీ సారి మీరు ఆధార్ అడ్రస్ చేంజ్ అయితే చేసుకో అక్కర్లేదు, కేవలం ఇది బ్యాంకు ఖాతాలు తెరిచేవారికి మాత్రమే ఉపయోగం.