ఏపీలో కరోనాలోనూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వం నిరాటంకంగా సాగిపోతుంది… ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు వైసీపీకి మద్దతు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే… ఇటీవలే ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సిద్దా రాఘవరావు కూడా వైసీపీ తీర్ధం తీసుకున్న సంగతి తెలిసిందే…
ఇక ఈ షాక్ నుంచి చంద్రబాబు నాయుడు కోలుకోక ముందే మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు… టీడీపీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి ఒకరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి….
ప్రస్తుతం జిల్లాలో వారి పరిణామాలను చూస్తుంటే వారి చేరికి లాంచనమే అని అనిపిస్తుందట.. గతంలో యూపీఏ హయాంలో ఓ వెలుగు వెలిగిన కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డిని వైసీపీలోకి తెచ్చుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి… అంతా అనుకున్నట్లు జరిగితే మరో వారంలో ఆయన కుటుంబం వైసీపీలో చేరిపోవడం ఖాయం అని అంటున్నారు…