అధ్యక్షుడి కున్న శ్రద్ద మిగతా నాయకులకి లేకపోయే ..

అధ్యక్షుడి కున్న శ్రద్ద మిగతా నాయకులకి లేకపోయే ..

0
91

2019 ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తారుమారయ్యింది . అయితే పార్టీ ని బలోపేతం చేసే విషయం లో తెలంగాణ లో రేవంత్ రెడ్డి తప్ప మిగతా నాయకులెవ్వరూ చొరవ చూపలేదు . దీనిపై అయన చాల సార్లు అసహనం వ్యక్తం చేసారు ..అయితే ఇదే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఎదుర్కొంటున్నాడు .

ఒక వైపు ghmc ఎన్నికలు దూసుకొస్తున్న నేపథ్యం లో కెసిఆర్ తన కార్యాచరణ మొదలుపెట్టి పార్టీ ని బలోపేతం చేస్తున్నారు . తెరాస కి పోటీగా బండి సంజయ్ కూడా అభ్యర్థులను సిద్ధం చేస్తున్నారు . ఈయన విశ్రాంతి లేకుండా బీజేపీ గెలుపు కోసం పరితపిస్తుంటే మిగతా నేతల్లో ఆ తపన కనపడక పోవడం పై అయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది .

తెలంగాణాలో తెరాస దూకుడిని తట్టుకొని నిలబడాలంటే బీజేపీకి చాలా కష్టమనే చెప్పాలి . ఎమ్మెల్యే రాజాసింగ్ ,ధర్మపురి అరవింద్ లాంటి నాయకులూ మాత్రం తెరాస ని విమర్శిస్తూ ఆ పార్టీ ని బలహీనం చేయడానికి ప్రయత్నిస్తున్న కూడా మిగతా నాయకుల్లో మాత్రం స్పందన రావటం లేదు .పరిస్థితి ఇలాగె కొనసాగితే తెలంగాణాలో బీజేపీ ప్రస్తావన ఎక్కడ ఉండదన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది .