రేపు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే..

0
103

ఏపీ, తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీనితో నదులు, ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి. నిన్న సీఎం జగన్ ఏపీలోని పలు ప్రాంతాలలో ఏరియల్ సర్వే చేపట్టారు. మరోవైపు తెలంగాణలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నిజామాబాద్, భద్రాచలం వంటి పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో రేపు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే చేపట్టనున్నారు.

అయితే ఈ ఏరియల్ సర్వే కడెం నుంచి భధ్రాచలం వరకున్న గోదావరి పరీవాహక ప్రాంతంలో కొనసాగనుంది. ఈ సర్వేలో కేసీఆర్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొననున్నారు.
ఈ మేరకు ఏరియల్ సర్వేకు సంబంధించిన హెలికాప్టర్ రూటు సహా తదితర విధి విధానాలను అధికార యంత్రాంగం పర్యవేక్షించి రూట్ ను ఫైనల్ చేయనున్నారు.

మరోవైపు ప్రజారోగ్య సంరక్షణలో భాగంగా, వరదల వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా గోదావరి వరద ముంపు ప్రాంతాల్లోని దవాఖానాలకు చెందిన డాక్టర్లు, ఉన్నతాధికారులతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్షాసమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రేపటి సిఎం పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన కార్యాచరణ పై వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తుంది.