‘సైన్యాన్ని కూడ కాషాయ దళంగా మార్చేందుకే అగ్నిపథ్’

0
108

అగ్నిపథ్ పథకంపై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ సంచలన వ్యాఖ్యలు చేసాడు.  భవిష్యత్తులో సమాజంపై అగ్నిపథ్ పథకం ప్రభావం అధికంగా పడే అవకాశం ఉందని వెల్లడించారు. రాబోయే రోజుల్లో దానివల్ల జరిగే నష్టం గురించి ఎవరు ఆలోచించడం లేదని ఆవేదన వ్యక్తం చేసాడు.

సైన్యాన్ని కూడ కాషాయ దళంగా మార్చేందుకు అగ్నిపథ్ పథకం తీసుకొచ్చి..ఆర్మీలో ఉండే క్రమశిక్షణని త్రివధ దళాధిపతులు పాటించాలి. అగ్నిపథ్ నోటిఫికేషన్ ద్వారా దానిలో ఉన్న డొల్లతనం బయటపడిందని కామెంట్స్ చేసాడు. ఆర్మీ చీప్ ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు..ఇప్పుడు క్రమశిక్షణ తప్పి మాట్లాడారు.

రాబోయే రోజుల్లో అగ్నిపథ్ వల్ల కలిగే నష్టం గురించి ఆలోచించండి. అగ్నిపథ్ నోటిఫికేషన్ ద్వారా దానిలో ఉన్న డొల్లతనం బయటపడింది. దేశ సేవలో పాలు పంచుకుంటూ జీవితంలో స్థిరపడాలని యువత చూస్తారు. వారి ఆశలకు గండికొట్టారు. నాలుగు సంవత్సరాల కోసం యువత ఆర్మీలో చేరారు.

ప్రధాని , త్రివధ దళాల అధిపతులు గమనించాలి. 25 శాతం అగ్నిపథ్ లో చేరిన వారిని కొనసాగిస్తాము అంటున్నారు..అది కూడ ఉండకపోవచ్చు. అగ్నిపథ్ లో చేరిన వారిని నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడైనా తీసేయవచ్చు. దేశంలో బీజేపీ మత విద్వేశాలని రెచ్చగొడుతోంది. సైనిక క్రమశిక్షణకు విరుద్ధంగా అర్మీ చీప్ మీడియా ముందు మాట్లాడారని ఆయన విమర్శించారు.