అగ్రరాజ్యంలో ఆగని అగ్నిజ్వాలు

అగ్రరాజ్యంలో ఆగని అగ్నిజ్వాలు

0
102

జార్జ్ ప్లాయిడ్ దారుణ హత్యోదంతం అగ్రరాజ్యాన్ని కుదిపేస్తుంది… ఆఫ్రికన్ అమెరికన్లు తీవ్ర నిరసనలతో దేశంలో విద్వంసకర పరిస్థితి ఏర్పడ్డాయి… పలు రాష్ట్రాల్లో లూటీలు మొదలయ్యాయి… ఒక దశలో స్వయాన అమెరికా అధ్యక్షుడే అండర్ గ్రౌండ్ లోకి వెల్లవలసి వచ్చిన సంగతి తెలిసిందే… ఈ నేపథ్యంలో క్రమక్రమంగా పరిస్థితులు మరింత తీవ్రతరం కావడంతో నిన్న సాయంత్రం అధ్యక్షుడు ట్రంప్ నిరసన జ్వాలలు అధికంగా ఉన్న రాష్ట్రాల గవర్నర్లతో మాట్లాడిన వెంటనే నేషనల్ గార్ట్స్ ను రంగంలోకి దింపి శాంతి భద్రతలను అదుపుచేయాలని చూస్తున్నారు…

లేనిపక్షంలో సైన్యాన్ని రంగంలోకి దించక తప్పదని ఘాటుగా హెచ్చరించారు… శ్వేతసౌద్యం లోని ట్రంప్ ప్రసంగం కొనసాగుతుండగానే నల్ల జాతి అమెరికన్లు పార్క్ ఆవరణలో నిరసనకు దిగారు… జార్డ్ ప్లాయిడ్ హత్యోదంతంలో అమెరికన్ చెబుతున్న విషయాన్ని కట్టుకథలుగానే కనపడుతున్నాయి… ఊపిరాడకుండా చేయడం వల్లనే అతను మరణించాడంటూ పోస్టుమార్టం నివేదిక వెలువడడంతో నిరసనకారులు నగరాలు అగ్నిగుండంలా మారాయి…

సూపర్ మార్కెట్ లు లూటీ అయ్యాయి.. క్రమక్రమంగా అందోళనలు హింసాత్మకంగా మారడంతో వాషింగ్టన్ సైన్యాన్ని రంగంలోకి దింపిన ట్రంప్ అవసరమైతే దేశ మంతా కూడా సైన్యాన్ని మోహరింప చేసేందుకు సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది…