అగ్రరాజ్యం లో కొత్త గొడవ ట్రంప్ ని బంకర్లోకి తరలించిన అధికారులు

అగ్రరాజ్యం లో కొత్త గొడవ ట్రంప్ ని బంకర్లోకి తరలించిన అధికారులు

0
111

అమెరికాలో ఓ పక్క వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది, మరో పక్క మరో వివాదం ఇప్పుడు అమెరికాలో రాజుకుంది, అక్కడ ఉన్న నల్లజాతి వారు నిరసనలతో ఇప్పుడు అగ్రరాజ్యం అట్టుడుకుతోంది. గత వారం రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మే25న తెల్లజాతి పోలీస్ చేతిలో నల్లజాతీయుడు చనిపోవడంతో ఆగ్రహ జ్వాలలు పెరిగాయి.

దీంతో ఇప్పుడు ప్రతీ ఒక్కరు న్యాయం జరగాలి అని కోరుతున్నారు. మృతుడి సొంత స్టేట్ మిన్నెసోటాలో ప్రారంభమైన నిరసనలు ఇప్పుడు దేశంలోని మరో 20 రాష్ట్రాలకు విస్తరించాయి. దాదాపు 52 ఏళ్ల తరువాత మళ్లీ ఈ పరిస్థితి వచ్చిందని అక్కడ వారు అంటున్నారు.

అంతేకాదు అమెరికా అధినేత నివసిస్తున్న శ్వేత సౌధాన్నిఆందోళన చేస్తున్న వారు వదిలిపెట్టలేదు. ఆ భవన సమీపంలోని భవనాలను రాళ్లు విసురుతూ ధ్వంసం చేశారు. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను సురక్షిత ప్రాంతమైన బంకర్లోకి తరలించారు.