ముస్లిం మైనార్టీలు బిర్యానీ, షేర్వానీ, ఖుర్బానీల‌కే ప‌నికోస్తారా ?

0
91

1. బిసీ క‌మిష‌న్‌లో మైనార్టీలకు చోటేది? : సీఎం కేసీఆర్‌పై మండిప‌డ్డ ఏఐసీసీ అధికార ప్ర‌తినిధి డా. దాసోజు శ్ర‌వ‌ణ్‌కుమార్‌.
2. ముస్లిం మైనార్టీలు బిర్యానీ, షేర్వానీ, ఖుర్బానీల‌కే ప‌నికోస్తారా ?
3. గ‌త ఏడేళ్లుగా మోస‌పోతున్న ముస్లిం మైనార్టీల‌కు మ‌రోసారి దొక ఇచ్చిన సీఎం కేసీఆర్‌

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 24:
బిసీ క‌మిష‌న్‌లో ముస్లిం మైనార్టీల‌కు చోటు క‌ల్పించ‌క‌పోవ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు ఏఐసీసీ అధికార ప్ర‌తినిధి డా. దాసోజు శ్ర‌వ‌ణ్‌కుమార్‌. తెరాస స‌ర్కార్ వ‌చ్చిన‌ప్ప‌టి నుండి మైనార్టీల‌కు స‌ముచిత స్థానం వ‌స్తుంద‌ని ఆశించిన మైనార్టీల‌కు మ‌రోసారి అన్యాయం చేశార‌ని మండిప‌డ్డారు. సీఎం కేసీఆర్‌ని న‌మ్ముకున్న వారికి దోకా మీద దోకా ఇస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీన్ని ప్ర‌తి ఒక్క ముస్లిం సోద‌రి, సోద‌రీమ‌ణులు ఆలోచించాల్సిన విష‌య‌మ‌న్నారు.

” 240 జీవో జారీ చేస్తూ… బిసీ క‌మిష‌న్ ఛైర్మ‌న్‌గా తెరాస నాయ‌కులు వ‌కుళాభ‌ర‌ణం కృష్ణ‌మోహ‌న్, స‌భ్యులుగా ఉపేంద్ర‌, శుభ‌ప్ర‌ద్ ప‌టేల్‌, కిషోర్‌గౌడ్‌ల‌ను నియ‌మించారు. ఇప్ప‌టికైన పున‌రుద్ద‌రించినందుకు స్వాగ‌తిస్తున్నాం. అయితే బిసి క‌మిష‌న్‌లో మైనార్టీ వ‌ర్గాల సంబంధించిన వ్య‌క్తుల‌కు చోటు లేక‌పోవ‌డం బాధాకారం. గ‌త ఏడేళ్లుగా వంచిస్తున్న కేసీఆర్‌, బిసీ క‌మిష‌న్‌లో మ‌రోసారి వారిని మోసం చేశారు. ముస్లింలు అంటే కేవలం బిర్యానీ, షేర్వానీ, ఖుర్బానీ కోస‌మేనా, అని సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కులు దాసోజు శ్ర‌వ‌ణ్ సీఎం కేసీఆర్‌ని ప్ర‌శ్నించారు.”

” కాంగ్రెస్ ప్ర‌భుత్వం మైనార్టీల‌ల‌ను బిసీ-ఈ జాబితాలో చేర్చి రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించింది. ముస్లిం మైనార్టీల‌ను అన్ని ర‌కాలుగా ఆదుకుంది. వారి అభివృద్ధికి తోడ్ప‌డింది. కానీ తెరాస ప్ర‌భుత్వం గ‌త ఏడేళ్లుగా అన్ని విధాలుగా నిర్ల‌క్ష్యం చేసింది. కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చిన నాలుగు నెల‌ల్లోనే ముస్లింల‌కు 12శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తామ‌ని చెప్పి న‌మ్మించి మోసం చేశారు. వ‌క్ఫ్‌బోర్డ్‌కి జూడిషియ‌ల్ స్టేట‌స్ ఇస్తామ‌ని చెప్పి మాట త‌ప్పారు. వ‌క్స్‌బోర్డ్ భూముల‌ను కాపాడుతామ‌ని చెప్పిన సీఎం వాటి గురించి ప‌ట్టించుకోవ‌డం లేదు. అలాగే మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేష‌న్‌కి నిధులు మంజూరు చేయ‌డం లేదు. రుణాల మంజూరు విష‌యంలో మైనార్టీల‌ను పూర్తిగా విస్మ‌రించారు. ఎన్నిక‌ల ముందు మైనార్టీల‌కు రిజ‌ర్వేష‌న్లు, నిధులు, ఉద్యోగాలు, రుణాలు ఇస్తామ‌ని న‌మ్మించి ఓట్లు వేయించుకున్నారు. తీరా అధికారంలోకి వాటినికి అట‌కెక్కించార‌ని అన్నారు. చివ‌రికి కేసీఆర్ మైనార్టీల‌ను ఓట్లు వేసే యంత్రాలుగా వాడుకుంటున్నారు, అని డా. దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.”