కరోనా ఫస్ట్ వేవ్ లో కేసిఆర్ ఆ ఒక్క మాటతో నవ్వులపాలయ్యారు

0
84

”కరోనా పై అప్రమత్తంగా ఉండాలని చెప్పాల్సిన ప్రభుత్వ పెద్ద సీఎం కేసీఆర్ .. నిర్లక్ష్యానికి, బాధ్యతరాహిత్యనికి పరాకాష్టగా మారారని విమర్శించారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. ఢిల్లీలో ఏర్పాటు మీడియా సమావేశంలో దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. గతంలో కరోనాకి పారసిటమాల్ వేసుకుంటే సరిపొతుందని చెప్పిన కేసీఆర్.. తాజాగా వాసాలమర్రి సమావేశంలో ”అసలు కరోనా ఉందా? ఏం కరోనా ? ఏం బ్లాక్ ఫంగస్? డోలో వేసుకుంటే సరిపొతుంది” అని వ్యాఖ్యలు చేయడం కేసీఆర్ బాధ్యతరాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు దాసోజు.

”కరోనా ఫస్ట్ వేవ్ ప్రారంభమౌతున్న రోజుల్లో అసెంబ్లీలో చర్చ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ”మాస్క్ లు ఎందుకు ?  మా ఎమ్మెల్యే, మంత్రులు మాస్కులు లేకుండానే కరోనా కట్టడి చేస్తారు. అవసరమైతే వెయ్యికోట్ల రూపాయిలు ఖర్చు చేసి కరోనాని తెలంగాణ నుంచి తరిమికొడతాం” అని అపహాస్యం చేశారు. కేసీఆర్ చేసిన అపహాస్యానికి ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి  వచ్చింది. వేలాది  మంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది అనాధలయ్యారు. వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మొదటి దశని ఎదుర్కొవడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైయింది” అని వివరించారు దాసోజు.

”కరోనా సెకెండ్ వేవ్ లో వేలాది మంది ఆక్సిజన్ బెడ్స్ లభించక, రెమిడిసివిర్ లాంటి లైఫ్ సేవింగ్ ఇంజెక్షన్స్ దొరకక, నానా ఇబ్బందులకు గురై తెలంగాణలో దాదాపు లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. కానీ సిగ్గులేని కేసీఆర్ ప్రభుత్వం కేవలం మూడు, నాలువేలమందే చనిపోయారని దొంగలెక్కలు చెబుతుంది. కరోనా ఫస్ట్ వేవ్ నుంచి ఇప్పటివరకూ కేవలం గ్రేటర్ హైదరాబద్ లోనే దాదాపు లక్షమంది కరోనాతో ప్రాణాలు విడిచారు. పరిస్థితి ఇంత దారుణంగా వుంటే.. దాదాపు ఏడాదిన్నరగా ప్రగతి భవన్ నుంచి కాలు బయటపెట్టని కేసీఆర్.. నేడు బయటికి వచ్చి అసలు కరోనానే లేదని చెప్పడం కేసీఆర్ లెక్కలేని తనానికి నిదర్శనం. కరోనా అంటే కేసీఆర్ మజాక్ అయిపొయింది. అసలు కరోనానే లేదని చెబుతున్న కేసీఆర్.. మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రెమిడిసివిర్, బ్లాక్ ఫంగస్ మందులు ఎలా ఇచ్చారు ? కరోనాకి సంబధించి అన్ని రకాల మందులకు అందుబాటులో ఉంటామని ఎందుకు చెప్పారు ? అని ప్రశ్నించారు దాసోజు.

”కేసీఆర్ ఫస్ట్ వేవ్ సమయంలో అసెంబ్లీలో పారసిటిమాల్ అని చెప్పి నవ్వులుపాలయ్యారు. అయినా సిగ్గులేకుండా ఇప్పుడు ‘డోలో’ అని చెబుతున్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో వున్న కేసీఆర్ ఇంత బాద్యత రాహిత్యంగా ఎలా మాట్లాడుతున్నారు ?  కేసీఆర్ చెప్పినట్లు డోలో ఒక్కటే సరిపోతే.. ఐసిఎంఆర్ అనేక లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ని ఎందుకు సూచించింది ? శాస్త్రీయతలేకుండా, మెడిసన్ పై ఒక అవగాన లేకుండా కేసీఆర్  బాద్యతరాహిత్యంగా ఎలా మాట్లాడుతున్నారు? మెడిషన్స్ చెప్పడానికి కేసీఆర్ ఏమైనా డాక్టరా ? ఏం  మందులు వేసుకోవాలో డాక్టర్లు చెబుతారు. ప్రజలుని జాగ్రత్త ఉండమని చెప్పాల్సిన కేసీఆర్ మజాక్ చేస్తున్నట్లు మాట్లడటడం దారుణం” అని విమర్శించారు దాసోజు.

”కరోనా ఉదృతంగా వున్న సమయంలో కేసీఆర్ సర్కార్ తప్పుడు లెక్కలు చూపించి ప్రజలని ఆపదలోకి నెట్టింది. అసలు కరోనానే లేదని కోర్టుకు, ప్రజలకు తప్పుడు లెక్కలు చూపించింది. కేసీఆర్ సర్కార్ చెప్పిన లెక్కల ప్రకారం కరోనా ఇంకా ముగిసిపోయిన అధ్యాయమని కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ప్రజలు మళ్ళీ మామూలుగా జీవనంలోకి వచ్చారు. కానీ అప్పుడే ప్రజలకు నిజాలు చెప్పుంటే వారు తగు జాగ్రత్తలు తీసుకునేవారు. కరోనా విషయంలో ప్రజల తప్పు లేదు. కేసీఆర్ సర్కార్ ప్రజల జీవితంతో చెలగాటం ఆడింది. తప్పుడు లెక్కలు చూపించి లక్షల చావులకు కారణం అయ్యింది” అని ఆరోపించారు దాసోజు.

”ప్రైవేట్ హాస్పిటల్స్ ల దోపిడీ తగ్గించండని గత రెండు నెలలుగా కోరుతున్నాం. ధరలని నిర్ణయిస్తూ జీవో తీసుకురామని ప్రతి రోజు కోరుతున్నాం.  కానీ జీవో తీసుకురాలేదు. కానీ కోర్టులో హియరింగ్ వుందని చెప్పి, కోర్టు ముందు చూపించడానికి మాత్రమే అన్నట్టుగా రాత్రిరాత్రి ఏదో జీవో తెచ్చారు. కోర్టు నుండి తప్పించుకోవడానికి మాత్రమే జీవో తెచ్చారు తప్పితే ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ నుంచి ప్రజలని కాపాడాలనే చిత్తశుద్ధి కేసీఆర్ సర్కార్ కి లేదు” అని మండిపడ్డారు దాసోజు.

”థర్డ్ వేవ్ వస్తుందని శాస్త్రవేత్తలు, పరిశోదన సంస్థలు హెచ్చరిస్తున్నాయి. కానీ  కేసీఆర్ మాత్రం థర్డ్ వేవ్ రాదని తీర్మానించారు. అసలు ఏ ప్రాతిపదికన థర్డ్ వేవ్ రాదని కేసీఆర్ చెబుతున్నారో ప్రజలకి చెప్పాలి. ఒక్క ఖమ్మంలోనే  చూసుకుంటే 1420మంది పిల్లలకి కరోనా సోకింది. కేవలం 21రోజుల్లోనే ఈ కేసులు నమోదు కావడంపై డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. పాజిటివ్ రేట్ పెరిగే ప్రమాదం వుందని హెచ్చరించారు. కానీ కేసీఆర్ మాత్రం కరోనా లేదు, థర్డ్ వేవ్ లేదని ఎలా చెప్తారు. థర్డ్ వేవ్ లో పిల్లలకి ప్రమాదం పొంచివుందని ఎయిమ్స్ వైద్యులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లా అయిన ఖమ్మంలో పిల్లల కేసులు పెరుగుతున్నాయి. కానీ కేసీఆర్ మాత్రం కరోనా లేదని చెప్పడం దుర్మార్గం. కరోనా మరణాలకు సంబధించిన కేసీఆర్ సర్కార్ తప్పులెక్కల చిట్టా విప్పుతాం. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని బహిర్గతం చేస్తామని హెచ్చరించిన దాసోజు శ్రవణ్..  ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రజలని రక్షించాలి. కానీ భాద్యతరాహిత్యంగా మాట్లాడి ప్రజలని ఆపదలోకి నెట్టడం దారుణం అన్నారు.