జగన్ కు ఆ పని నేర్పించింది కేసిఆరే : దాసోజు శ్రవణ్ ఫైర్

0
98

”సీఎం కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని చేతబడి చేసి బానిసగా మార్చేశారు. ముఖ్యమంత్రిని సైతం కాలర్ పట్టుకొని నిలదీసే ధైర్యం వున్న తెలంగాణ సమాజం నేడు కేసీఆర్ చేతబడి కారణంగా బానిసగా మారింది” అని పేర్కొన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. కృష్ణా జలాల న్యాయమైన వాటా- పెండింగ్ ప్రాజెక్టులు సత్వర పూర్తి అంశంపై టీ జర్నలిస్ట్ ఫోరం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్నారు దాసోజు.

ఈ సందర్భంగా దాసోజు మాట్లాడుతూ.. మహాభారత యుద్దానికి ప్రధాన కారకులు శకుని, దుర్యోధనుడు. వీరు స్వార్ధ ఆదిపత్య అహంకారం కారణంగా నాడు యుద్ధం జరిగింది. నేడు శకుని గా సీఎం కేసీఆర్, దుర్యోధనుడి గా సిఎం జగన్ మోహన్ రెడ్డి.. ఆంధ్ర- తెలంగాణ మధ్య చిచ్చు పెడుతూ తమ రాజకీయ, ఆర్ధిక ఆదిపత్య అహంకారం కొరకు యుద్ద వాతావరణంను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి వీరి డ్రామాలని, కుట్రని ఇరు రాష్ట్రాల ప్రజలు గ్రహించాలి” అని పేర్కొన్నారు దాసోజు.

”కేసీఆర్ 2019ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి డబ్బులు పంపీ జగన్ ని గెలిపించిన మాట వాస్తవం కాదా ? జగన్ ని సొంత కొడుకుని చూసుకున్నట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో దోచేసిన సొమ్ములో మూడువందల కోట్లు జగన్ కి పంపీ ఎన్నికల్లో గెలవడానికి సహకరించారు కేసీఆర్. ఇది ఓపెన్ సీక్రెట్. కేసీఆర్ జగన్ మధ్య ఓ అవినావభావ సంబంధం వుంది. డబ్బులు లేకుండ ఇబ్బంది పడుతున్న జగన్ మోహన్ రెడ్డికి డబ్బులు ఎలా సంపాదించాలో సుద్దులు నేర్పిన కేసీఆరే… 47వేల కోట్ల రూపాయిల కాంట్రాక్టర్ ని ఓకే వ్యక్తికి ఇచ్చి తద్వారా జగన్ మోహన్ రెడ్డి స్వీయ లోటు బడ్జెట్ ని భర్తీ చేసే కుట్ర జరుగుతుంది ఇది జగన్ కి ఆర్ధిక లభ్ది. అదే విధంగా కేసీఆర్ మెడలు వంచి నీళ్ళు తీసుకొచ్చాడు జగన్ అని ఏపీ ప్రజలు అనుకోవాలి. అది రాజకీయ లబ్ది.

”ఇక కేసీఆర్ విషయానికి వస్తే సంగమేశ్వరం బ్యారేజీ కడతా అన్నారు. కొత్త ప్రాజెక్ట్. జూరాల నుంచి పాకాల ప్రాజెక్ట్ కడతామంటున్నారు. ఇదీ కొత్త ప్రాజెక్ట్. ఇలా కొత్త ప్రాజెక్ట్, కొత్త కమీషన్లు.. ఇది కేసీఆర్ కి ఆర్ధిక లబ్ది. ఇక మన హక్కులు కాపాడటం కోసం జగన్ తో కేసీఆర్ యుద్ధం చేస్తున్నారని తెలంగాణ ప్రజలు అనుకోవాలి. ఇది రాజకీయ లబ్ది. జగన్ మోహన్ రెడ్డి కేసీఆర్ కుమ్మక్కై రాజకీయ, ఆర్ధిక లభ్ది కోసం ఆడుతున్న డ్రామా. ఈ డ్రామాని తెలంగాణ సమాజం అర్ధం చేసుకోవాలి” అని వివరించారు దాసోజు.

”తెలంగాణ వున్న ఆంద్ర ఓటర్లు ఓటు వేయోద్డా? అని టీజీ వెంకటేష్ మాట్లాడుతున్నారు. ఇలాంటి సన్నాసి మాట్లాడుతున్న సన్నాసులు తెలంగాణలో వున్నది ఆంధ్ర ఓటర్లు కాదు వారు తెలంగాణ ఓటర్లు అనే సంగతి గుర్తు పెట్టుకోవాలి. మాకు వైరుధ్యాలు లేవు. గత ఏడేళ్ళుగా అన్నదమ్ముల లెక్క కలసివున్నాం. మీరు వచ్చి ఆంద్ర – తెలంగాణ మధ్య పంచాయితీ పెట్టే ప్రయత్నం చేస్తున్నార్రా సన్నాసుల్లారా ? అని ధ్వజమెత్తారు దాసోజు.

” తాడై మెడకు వేసుకుంటే పామై చుట్టుకున్న కేసీఆర్…తెలంగాణ సమాజాన్ని క్షుద్ర మాంత్రికుడు లెక్క చేతబడి చేశారు. తన చేతబడితో తెలంగాణ సమాజాన్ని బానిసగా మార్చారు. చేతబడితో ప్రజల్ని ఓట్లు వేసే యంత్రాలుగా చేశారు. ముఖ్యమంత్రిని సైతం కాలర్ పట్టుకొని నిలదీసే ధైర్యం వున్న తెలంగాణ సమామాజం నేడు కేసీఆర్ చేతబడి కారణంగా బానిసగా మారింది. రోడ్లపైకి వచ్చి పోరాటం చేసిన ప్రజలని నేడు కేసీఆర్ ఓటు యంత్రాలుగా మార్చే కుట్ర చేస్తున్నారు. బీరు , బిర్యానీతో ఓటు కోనేయొచ్చనే ఉన్మాద స్థితిలో వున్నారు కేసీఆర్. డబ్బుతో ప్రజలని, మేధావులని బానిసలుగా చేసుకోవచ్చనే ధైర్యం కేసీఆర్ లో కనిపిస్తుంది. తెలంగాణ సమాజం దీనిని గుర్తించాలి. కేసీఆర్ క్షుద్ర రాజకీయంపై పల్లెపల్లెలలో చర్చ జరగాలి. చైనత్యం రావాలి. ఏ లక్ష్యం కోసం తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నారో.. ఏ లక్ష్యం కోసం లక్షలాది తెలంగాణ బిడ్డలు రోడ్లపైకి వచ్చి జీతాన్ని, జీవితాన్ని పణంగా పెట్టి తెలంగాణ కోసం కొట్లాడారో.. ఆ లక్ష్యానికి విరుద్దంగా పని చేస్తున్న కేసీఆర్ సర్కార్ దుర్మార్గాన్ని ఎండగట్టాలి” అని పిలుపునిచ్చారు దాసోజు.

”బిజెపి శాడిజం పరాకాష్టకు చేరింది. తగిలించి తమాషా చూస్తుంది బిజెపి. విభజన చట్టం ప్రకారం జల పంపిణీకి సంబధించి కొత్త ట్రబ్యునల్ ని ఏర్పాటు చేసుకునే అవకాశం వుంది. కానీ ఏడేళ్ళుగా కృష్ణా ట్రబ్యునల్ ని ఏర్పాటు చేయలేదు. కేసీఆర్ ఈ విషయంలో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు జలవివాదం రేపి ఆర్ధిక, రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు. తమాషా చూస్తున్న బిజెపి ఇకనైన పెద్దన్న పాత్ర పోషించాలి. ఇరు ప్రాంతాలు కొట్లాడుకుంటే తమాషా చూడాలనుకుంటున్న ఉన్మాద స్థితిని బయటికి వచ్చి కృష్ణా ట్రబ్యునల్ ని ఏర్పాటు చేయాలి” అని డిమాండ్ చేశారు దాసోజు.

ఇదే సమావేశంలో స్టాఫ్ నర్సుల అరెస్ట్ పై స్పదించారు దాసోజు శ్రవణ్. కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి లక్షలాది మందికి సేవలు అదించిన స్టాఫ్ నర్సులని అకారణంగా అరెస్ట్ చేసి కాజిగూడ పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఓవర్ స్టాఫ్ పేరుతో స్టాఫ్ నర్సులని తొలగించిన కేసీఆర్ సర్కార్.. నర్సులు న్యాయంగా నిరస తెలిపితే వారిని అరెస్ట్ చేసి జైల్లో పెడతారా ? ప్రాణాలు కాపాడిన నర్సులకు కేసీఆర్ సర్కార్ ఇచ్చే గౌరవం ఇదేనా ? కేసీఆర్ కి చీము నెత్తురు మానవత్వం వుంటే వాళ్ళ ఉద్యోగాలని రిస్టోర్ చేసి భేషరతుగా వాళ్ళని విడిచిపెట్టాలి” అని డిమాండ్ చేశారు దాసోజు.