కేసిఆర్ తెలంగాణ తాలిబన్

0
124

తెలంగాణ తాలిబన్లలాగా మారిన టీఆర్ఎస్

అప్గానిస్తాన్ని తాలిబన్లు నాశనం చేసినట్టు, కేసీఆర్ సేన తెలంగాణను చేరబట్టింది – ఏఐసీసీ అధికార ప్రతినిది దాసోజు శ్రవణ్

? సీఎం కేసీఆర్ తాలిబన్ల‌ మాదిరిగా ప్రభుత్వ వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నారు :ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు

? కేసీఆర్ దళిత బంధుతో మోసం చేస్తున్నారు, హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసిన తర్వాత దళిత బంధు ఉండదు.

? హుజురాబాద్‌లో ప్రభుత్వ సమావేశమా.. పార్టీ సమావేశమా..? ప్రభుత్వ సమావేశం అయితే,పాడి కౌశిక్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎందుకు ఉన్నారు?

? సీఎస్ సోమేశ్ కుమార్ చిల్లరగా వ్యవహరిస్తున్నారు.

? 7 ఏళ్లలో సీఎంగా కేసీఆర్ ఏ ఒక్క రోజు కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేయలేదు.

? మొట్టమొదటి సారిగా ఏడేళ్లలో ప్రగతి భవన్ లోకి దళిత ఐఏఎస్ కు అడుగుపెడుతున్నారు. ఏడేళ్లలో దళితులకు లక్షా 25 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా చేయలేదు. ఏడేళ్లలో దళితులకు వాటాగా రావాల్సిన నిధులలో 65 శాతం పక్కదారి పట్టించారు.

హైదరాబాద్, ఆగస్టు 17: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అప్గానిస్తాన్ తాలిబన్లాగా మారారని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్కుమార్. బీహర్ రాష్ట్రంగా తెలంగాణను మార్చుతున్నారని, ప్రజల సొమ్మును దోచి పబ్బం గడుపుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు పేరుతో రాజకీయ డ్రామా మొదలు పెట్టారని అన్నారు. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో తలపెట్టిన దండోర సభను విజయవంతం చేయాలని కోరారు.
దళితులను మోసం చేస్తే పిల్లుల భయపడరని, దళిత పులులుగా తిరుగబడుతారని హెచ్చరించారు.

ఏడేళ్లు దళితులను పట్టించుకొని సీఎం కేసీఆర్ ఇయ్యాల రసమయిని మొదలుకొని దళిత నేతలను, నాయకులను కౌగిలించుకున్నారని విమర్శించారు. హుజురాబాద్ నియోజకవర్గం శాలపల్లిలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ సభలో తెరాస నాయకులు ఎలా కూర్చుంటారని ప్రశ్నించారు. ఇటీవల పార్టీలోకి వెళ్లిన కౌశిక్రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్తి గెల్లు శ్రీనివాసులతో పాటు పలువురు తెరాస నాయకులు ఏ అధికారంతో సభలో కూర్చున్నారని ద్వజమోత్తారు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ చాలా ఛీప్గా వ్యహరించారని మండిపడ్డారు. ప్రభుత్వ సభలో తెరాస నాయకులు కూర్చుంటే అతనికి సోయి లేదా అని మండిపడ్డారు. వారి స్వలాభం కోసం తెరాస పార్టీ తొత్తులుగా మారుతున్నారని అన్నారు. గులాబీ రంగులో కలెక్టర్ ఏలా స్వాగత తొరణాలు కట్టారాని ప్రశ్నించారు. పరిపాలన చేతకాకపోతే గులాబీ కండువ కప్పుకోవాలని సూచించారు. అంతేకానీ ప్రజలను మోసం చేయవద్దన్నారు. సోమేష్ కుమార్ బాధ్యత మరిచి ఓ వ్యక్తికి బానిసలా పని చేస్తున్నారని అన్నారు.

దళితబంధు పథకం ప్రారంభ సభలో కేసీఆర్ నోటికి ఎటు వస్తే అటే మాట్లాడరన్నారు. కేసీఆర్ నీది నోరా, మోరా అని అడిగారు. ఏనాడు అంబేడ్కర్ బొమ్మకు పూలదండ వేయని అతను, పూలదండ వేసి దళితులను మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చట్ట సభల్లో దళితులన ప్రభువులను చేస్తానని కాకమ్మ కబుర్లు చెబుతున్నారు.

ఏడేళ్లుగా దళితులకు మూడు ఏకరాల భూమి ఇవ్వలేదు, విద్యా, వైద్యం, కేజీ టూ పీజీ విద్య, దళితుడిని సీఎం చేయని వాడు ఇప్పుడు దళిత బందు అంటు కొత్త నినాదంతో ముందుకు వస్తున్నారు. దళిత బందు పేరుతో కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తామని అంటున్నారు. మోడల్గా హుజురాబాద్ నియోజవకర్గంలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న దళిత కుటుంబాలు, అర్హులు ఎంతమంది అన్న విషయాలను ఇంకా ప్రకటించలేదు. దాదాపు 18 లక్షల దళిత కుటుంబాలున్నట్టు అంచనా, మరి వారందరికీ పది లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలంటే ఎన్ని ఏళ్ళు పడుతుంది. కేసిఆర్ చెప్పిన ఒక్క మాట అయినా ఇప్పటి వరకు నెరవేర్చారా.. దళిత బంధు మాటలు ఎన్నికల కోసమే కదా.. ? గతంలో చేస్తామన్న ఒక్క పని చేయని కేసిఆర్ ఎన్నికలు వచ్చినపుడు మభ్యపెడుతామంటే ఎలా భరిద్దాం. దళిత ముఖ్యమంత్రి, దళిత కటుంబాలకు భూములు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, ఇంటికో ఉద్యోగం, రిజర్వేషన్లు, 50 వేల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, హైదరాబాద్ వరద బాధితులకు పది వేల రూపాయలు, ఇలా చెప్పుకుంటు పోతే వందల హామీలు ఇచ్చి మోసం చేశారు. దళితులని అడుగడుగునా దగా చేశారు కేసీఆర్.

దళితుల నిధులని దోచేశారు:

లక్షా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయిల సబ్ ప్లాన్ నిధులని సగం కూడా ఖర్చు చేయకుండా కాళేశ్వరంకి మళ్ళించారు. కాళేశ్వరం కింద ఒక్క ఎకరం భూమి దళితులకు లేదు. అటు నిధులు ఖర్చు కాలేదు ఇటు కాళేశ్వరం వల్ల ప్రయోజనం జరగలేదు. 9 లక్షల 15 వేల 553 మంది దళితులు స్వయం ఉపాధి కొరకు దరఖాస్తు చేసుకుంటే కేవలం లక్షా ఐదు వేల 957మందికి మాత్రమే నిధులు కేటాయించి మిగిలిన వారి నోట్లో మన్నుకొట్టారు. ఎస్సీ ఎస్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ కు 6వేల 4 వందల 99 కోట్ల రూపాయిలు గత ఏడేళ్ళుగా కేటాయిస్తే.. కేవలం 34. 5 శాతం అంటే 2246కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.

తెలంగాణ బిల్లు పాస్ కావడానికి ముఖ్య కారణమైన వ్యక్తి.. లోక్ సభ మాజీ స్పీకర్ దళిత బిడ్డ మీరాకుమార్ విషయంలో కేసీఆర్ మూర్ఖంగా వ్యవహరించారు. వంద సార్లు ఫోన్ చేసినా ఎటువంటి స్పందన లేదు. నేరెళ్లలో దళితుల పట్ల అమానుషంగా వ్యవహరించారు. ఈ రోజు దళితులు దూరం అయ్యారనే కొత్త డ్రామా కు తెరలేపారు. తెలంగాణ హైకోర్టు లో ఒక్క దళితుడు జడ్జి గా నియామకం జరగలేదు. దళితులపై ప్రేమ ఉంటే…హై కోర్టులో దళిత జడ్జి నియామకం జరిగేలా చూడాలన్నారు.

కేసీఆర్ అపరిచితుడు

కేసీఆర్ ఓ అపరిచితుడుగా మారాడు. రాముగా ఉన్నప్పుడు మనం అన్ని సక్కబెట్టుకోవాలి, రెమోగా మారకముందే మేల్కొవాలి. దళిత ప్రభుత్వ ఉద్యోగులకు దళిత బంధు ఇస్తానని అంటున్నావు. ఎలా ఇస్తావు, ఇది ముమ్మాటికి మోసం చేసే మాటలేనన్నారు.

ఎంబిసి లాగే మోసం
బీసీలను ఆదుకోవడానికి గతంలో చెప్పిన విధంగానే ఇప్పుడు దళిత బంధుతో దళితులను మోసం చేస్తున్నారు. ఏ ప్రాతిపదికన ఈ పథకం అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. 17 లక్షల మందికి దళిత బంధు అంటున్నావే ఆ వివరాలు ఓ వెబ్సైట్లో పెట్టి, వాళ్ల వివరాలు వెల్లడించాలన్నారు.