పదివేల రూపాయలు ఇంకెప్పుడిస్తారు కేటిఆర్ ?

0
106

”దాదాపు 5లక్షమంది అక్టోబర్ 2020 వరద బాదితులు నష్ట పరిహారం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. నష్ట పరిహారం ఎప్పుడు చెల్లిస్తారో మంత్రి కేటీఆర్ చెప్పాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు వాగ్ధానం చేసిన వరద సాయాన్ని యుద్ధప్రాతిపాదికన విడుదల చేయాలి” అని డిమాండ్ చేశారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. ఈ మేరకు మంత్రికి కేటీఆర్ కు ఓ బహిరంగ లేఖ రాశారు దాసోజు శ్రవణ్.

”గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగా గ్రేటర్ హైదరాబాద్ మరోసారి నీట మునిగింది. వరదలు కారణంగా వేలాది కుటుంబాలు మరోసారి రోడ్డునపడ్డ పరిస్థతి. తాజా వర్షాలు కారణంగా దాదాపు రూ. 200 కోట్ల నష్టకలిగిందని ప్రాధమిక అంచనా. మలక్‌పేట, ఎల్‌బి నగర్, ఉప్పల్, ఓల్డ్ సిటీలోని కొన్ని ప్రాంతాలు , జిహెచ్‌ఎంసిలోని ఇతర ప్రాంతాలో నష్టం వాటిల్లింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎనిమిది నెలల క్రితమే వరదలు ముంచెత్తి ప్రజలకు అపారమైన ధన ప్రాణ ఆస్తి నష్టాన్ని కలిగించాయి. మరి ఇలాంటి విపత్కర పరిస్థితిలో డ్రైనేజీ వ్యవస్థ, రెయిన్ వాటర్ డ్రెయిన్ స్ట్రక్చర్స్ వంటి సమస్యలని యుద్దప్రాతిపదికన పరిష్కారించాలి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మొద్దు నిద్రతో మరో వరదకు ప్రజలని బాదితులగా చేసింది. తాజా వరదలకు నష్టపోయిన వారిని ఆదుకునేలా ప్రభుత్వం పరిహారం ప్రకటించాలి. రానున్న 36గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసిన నేపధ్యంలో వర్షాలని ఎదుర్కోవడానికి జిహెచ్ఎంసీ సిద్దంగా ఉందా ? అని ప్రశ్నించారు.

”అక్టోబర్ 2020 వరదల్లో గ్రేటర్ లో లక్షమంది ప్రజలు తీవ్రంగా నష్టపోయారు . ధన ప్రాణ ఆస్తి నష్టం సంబధించింది. వేల మంది నిరశ్రాయులయ్యారు. కానీ బాదితులు నష్ట పరిహారం ఇంకా అందలేదు. జిహెచ్ఎంసీ ఎన్నికల కోడ్ నెపంతో సాయాన్ని నిలిపేశారు. అయితే కేసీఆర్, కేటీఆర్ మాత్రం గ్రేటర్ లో 6.56 లక్షల మంది వరద బాధితులకు ఇప్పటికే రూ .656 కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. కానీ కేసీఆర్, కేటీఆర్ చెబుతున్న ఈ లెక్క అనుమానంగా వుంది. కారణం అబ్ది పొందిన వారి వివరాలు జిహెచ్ఎంసీ డొమైన్ లో లేవు. వివరాలకు ఆర్ టీఐ లో అప్లీకేషన్ పెట్టుకున్నా జిహెచ్ఎంసీ కమీషనర్ నుంచి స్పందన లేదు. లభ్ది పొందిన వారి వివరాలు అదార్ కార్డ్, ఫోన్ నెంబర్లు, ఫోటోలతో జాబితా వుందని చెప్పిన కేసీఆర్ .. మరి ఆ వివరాలని పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టడం లేదు? పారదర్శకంగా ఎందుకు వుండటం లేదు ?” అని ప్రశ్నించారు దాసోజు.

”గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో సిఎం కేసీఆర్ రూ. 10,000 వరద సాయాన్ని అర్హత వున్న అందరికీ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఇస్తామని మాట ఇచ్చారు. అందుకుగాను మరో 250-350 కోట్ల రూపాయలు అంతకంటే ఎక్కువ చెల్లించాడానికి సిద్దంగా ఉన్నామని ఓ వాగ్దానం చేశారు. గ్రేటర్ ఎన్నికలు డిసెంబర్ 07, 2020 ముగుస్తాయి. భాదరకమైన విషయం ఏమిటంటే డిసెంబర్ 8 న 17,333 మంది బాధితులకు రూ .1733 కోట్లు జమ చేశారు. డిసెంబర్ 9, 11,103 మంది బాధితులకు రూ .1110 కోట్లు, డిసెంబర్ 11 న 9,971 మంది బాధితులకు రూ .9.79 కోట్లు. మొత్తంమీద.. డిసెంబర్ 8 నుండి ఇప్పటి వరకు 48,232 మంది లబ్ధిదారులకు రూ .48.23 కోట్లు మాత్రమే జమ చేసినట్లు జిహెచ్‌ఎంసి జాబితా విడుదల చేసింది. 48232 లబ్ధిదారులు 2020 నవంబర్ 19 లోపు దరఖాస్తు చేసుకున్నవారే. డిసెంబర్ 7 తర్వాత దరఖాస్తు చేసుకున్న ఒక్క లభ్దిదారుడి కి కూడా వరద సాయం అందలేదు. డిసెంబర్ 7 నుండి దరఖాస్తు చేసుకోవాలని కోరినప్పటికీ దీనిపై యు టర్న్ తీసుకున్నారు. లభ్దిదారులని నిర్ధారించడానికి జిహెచ్ఎంసి అధికారులు వివరాలు పరిశీలిస్తారని చెప్పారు. కానీ ఒక్క అధికారి కూడా వివరాలు పరిశీలించడానికి రాలేదు. లక్షమంది అమాయక బాధితులు కరోనా ని కూడా లెక్క చేకుండా ఆశతో మీ సేవా కేంద్రల వద్ద పడిగాపులు కాసుకొని దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ దరఖాస్తు లు ఎక్కడి వెళ్ళాయో తెలీదు ? జిహెచ్ఎంసి వాటిని పరిగణలోకి తీసుకుంటుందా లేదా ? లబ్దిదారుల జాబితాని ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు ? ఎందుకు పబ్లిక్ డొమైన్ లో వుంచడం లేదు ? ఈ గోప్యతే వరద సాయంలో భారీ కుంభకోణం జరిగిందన్న ఆరోపణలుని బలపరుస్తుంది” అని అనుమానం వ్యక్తం చేశారు దాసోజు.

”గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో వరద సాయాన్ని కూడా ఒక ప్రచార అస్త్రంగా వాడుకున్నారు కేసీఆర్ కేటీఆర్. కానీ ఇంతలో చీఫ్ సెక్రటరీ సోమశేఖర్ సరైన కారణాలు చూపకుండా వరదసాయాన్ని నిలిపేయాలని బాదితులకు నష్టం కలిగించే ఉత్తర్వులు ఇచ్చారు. చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జీహెచ్ఎంసీ, టీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్ధిక దివాళకోరుత నానికి నిదర్శనమా? లేదా ఇచ్చిన వాగ్దానాలని గౌరవించాలానే నిబద్ధత లేకపోవడమా ? అని ప్రశ్నించిన దాసోజు… ఎన్నికల అయిన వెంటనే సాయం పంపిణీ చేస్తామని ప్రజల్లో ఆశలు రేపి ఓట్లు వేయించుకున్న కేసీఆర్, కేటీఆర్.. ఏరు దాటిక తెప్ప తగలేసినట్లు .. ఓట్లు వేయించుకొని వరద బాదితులలు మొండి చేయి చూపించారు. బాద్యత గల ప్రతిపక్ష నేతగా అనేక సార్లు వరద సాయాన్ని విడుదల చేయాలని కోరడం జరిగింది. కానీ కేసీఆర్, కేటీఆర్ “రాత్ గయి బాత్ గయి” అనే వైఖరితో వున్నారు” అని విమర్శించారు దాసోజు.

”టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. లభ్ది పొందిన వారి వివరాలు వార్డ్, డివిజన్ వారిగా జాబితాని జిహెచ్ఎంసి సైట్ లో పారదర్శకంగా ఉంచాలి. వరద సాయం పంపిణీలో జరిగిన అవినీతిపై ఇప్పటికే హైకోర్టులో పిల్ నడుస్తుంది అని గుర్తు చేసిన దాసోజు.. సరైన అర్బన్ డెవలప్ మెంట్ పాలసీ ఏర్పాటు చేసి పెండింగ్ లో వున్న డ్రైనేజీ, నాళా వైడింగ్, మ్యాన్ హోల్స్, ఓపెన్ నాళా సమస్యలని పరిస్కారించాలని కోరారు దాసోజు.