ఏయ్.. గడ్డి పీకుతున్నరా? మీరు

0
107

”జూబ్లీ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్, ఫిల్మ్ నగర్, తెలంగాణ భవన్ .. మొత్తం పరిసరాల ప్రాంతంలో ఇష్టం వచ్చినట్లు విచ్చల విడిగా టీఆర్ఎస్ పార్టీ బ్యానర్లు, జెండాలు, హోర్డింగ్స్ , ఫ్లెక్స్ లు కడుతుంటే జీహెచ్ఎంసీ అధికారులు మొద్దు నిద్రపోతున్నారా ? అని విమర్శించారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రావణ్. కాంగ్రెస్ పార్టీ చెందిన ఎవరైనా ఫ్లెక్స్ కడితే నో హోర్డింగ్ , ఫ్లెక్స్ పాలసీ పేరు చెప్పిన వెంటనే తొలగించేస్తారు. మరి గత రెండు రోజులుగా టీఆర్ఎస్ పార్టీలో ఓ నాయకుడు చేరిక ఉందనే నెపంతో హోర్డింగ్స్ పెడుతుంటే జీహెచ్ఎంసి అధికారులు ఏం చేస్తున్నారు? హోర్డింగ్స్ పెట్టిన వారికి ఫైన్ ఎందుకు వేయడం లేదు ? ఇంత పక్షపాతమా ? టీఆర్ఎస్ కి ఒక చట్టం, మిగతా ప్రజలు మరో చట్టామా ? ఇదే రాజ్యం ? అని ప్రశ్నించారు.

”కాంగ్రెస్ పార్టీ తరపున మేము ట్వీట్ చేసిన తర్వాత యాక్షన్ తీసుకుంటామని జీహెచ్ఎంసీ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టర్ చెబుతున్నారు. మరి ఇంత నిన్నటి వరకూ ఏం చేశారు? టీఆర్ఎస్ కి భయపడుతున్నారా ? చేతకాకపొతే దిగిపోవాలి. చట్టం అందరికీ ఒకేలా వర్తించాలి. అంతేకాని టీఆర్ఎస్ పార్టీకి కొమ్ముకాసినట్లు వ్యావహరిస్తే ఊరుకునేది లేదు” అని హెచ్చరించారు దాసోజు శ్రావణ్.

”తెలంగాణ ఉద్యమంలో సొంత డబ్బులతో ఫ్లెక్స్ లు కట్టి పోరాడిన తెలంగాణ హోర్డింగ్ అసోసియేషన్ నోట్లో మన్ను కొట్టే విధంగా కొత్త హోర్డింగ్ పాలసీ తీసుకొచ్చారు. కొత్త హోర్డింగ్స్ పెట్టుకోమని చెప్పి వెంటనే రాత్రిరాత్రికి హోర్డింగ్స్ తీసేసే విధంగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో దానిపై ఆదారపడ్డ 20వేల కుటుంబాలని రోడ్డుకీడ్చారు. తెలంగాణ హోర్డింగ్ అసోసియేషన్ వారు హోర్డింగ్స్ పెట్టుకోవడానికి వీలు లేదని చెప్పి ఆంధ్ర హోర్డింగ్ అసోసియేషన్ వారికి మాత్రం హోర్డింగ్స్ పెట్టుకునే విధంగా వెసులుబాటు కల్పించి వారి దగ్గర కమీషన్లు తీసుకుని దందా చేస్తున్నారు. ఇంత దుర్మార్గం ఎందుకు ? అని నిలదీశారు దాసోజు.