”సీఎం కేసీఆర్ వెన్నులో వణుకుమొదలైయింది. కొత్త టీపీసీసీ రేవంత్ రెడ్డి రాకతో కేసీఆర్ గుండెల్లో రైళ్ళు పెరిగెడుతున్నాయి. లక్షలాది ప్రజలు, కార్యకర్తల ఆశీస్సులతో జరిగిన టీపీసీసీ ప్రమాణస్వీకారం కేసీఆర్ పతనానికి తొలిమెట్టు. భయంతో దిక్కు తోచని కేసీఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారు” అని విమర్శించారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. బుధవారం గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు దాసోజు.
”టీపీసీసీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే కమిటీ అంతా ఘనంగా ప్రమాణస్వీకారం చేసింది. లక్షలాది ప్రజలు, కార్యకర్తలు ఉత్సాహంగా ప్రమాణస్వీకారంలో పాల్గొని సరికొత్త మార్పుకు నాంది పలికారు. ఈ కార్యక్రమాన్ని వివిధ మాధ్యమాలలో ప్రజలకు చేరవేసిన ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా మిత్రులందరికీ ధన్యావాదాలు. మీడియా సహాయ సహకారాలు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఉండాలి. లక్షలాది కార్యకర్తలు, ప్రజలు, ఉద్యోగస్తులు, యువకులు,అభిమానులు తమ పనులని పక్కన పెట్టి మరీ ఈ కార్యక్రామానికి వచ్చి ఆశీర్వదించారు. వీరందరికి శిరస్సు వంచి నమష్కరించారు దాసోజు.
”లక్షాలాది కాంగ్రెస్ కార్యకర్తలు ప్రమాణస్వీకారమహోత్సవంలో పాల్గొనడమే కాకుండా రానున్న రెండున్నరేళ్లపాటు మరో యుద్దానికి తాము సిద్ధమనే శాంకేతం ఇచ్చారు. కేసీఆర్ దొర గడిని కూల్చడానికి మేము సిద్ధమని చెప్పారు. టీఆర్ఎస్ బానిస సంకెళ్ళ నుంచి తెలంగాణని విముక్తి చేయడానికి, అసెంబ్లీపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలనే సంకల్పంతో తరలివచ్చారు. సామజిక, ప్రజాస్వామ్య తెలంగాణ తీసుకురావాలనే లక్ష్యంతో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రమాణస్వీకారానికి వచ్చారు. కార్యకర్తలందరికీ కాంగ్రెస్ పార్టీ తరపున చేతులెత్తి నమస్కారిస్తున్నాం.” అని పేర్కొన్నారు దాసోజు.
”మార్పు కోసం, కేసీఆర్ దొర గడి కూల్చడం కోసం కాంగ్రెస్ పార్టీ అడుగు వేస్తే పోలీసులు తగుదునమ్మా అంటూ కేసులు పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యంగ బద్ధంగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ నేతృత్వంలో ప్రమాణస్వీకారం ర్యాలీకి అప్లీకేషన్ పెట్టుకున్నాం. కానీ కుట్ర పూరితగా పర్మిషన్ ఇవ్వలేదు. దొంగ కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వైఖరిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది” అని పేర్కొన్నారు దాసోజు.
”కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన కేసులు పెట్టడం కేసీఆర్ భయానికి సంకేతం. కేసీఆర్ నియంత పొగడలకు నిదర్శనం. పతనావస్త కు చేరుకున్న టీఆర్ఎస్ అధినాయకత్వం నాయకత్వం భయంతో పోలీసులని పాలెగాళ్ళు మాదిరిగా వాడుకొని కేసులు పెట్టే ప్రయత్నం దుర్మార్గం. ఈ కుట్ర వైఖరిని ఇటు పోలీసులు, అటు టీఆర్ఎస్ ప్రభుత్వం మానుకోవాలి” అని విజ్ఞప్తి చేశారు దాసోజు.
”టీఆర్ఎస్ పార్టీ ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఈ రోజు పోలీసులని అడ్డం పెట్టుకొని అడ్డమైన కేసులు పెడుతున్న టీఆర్ఎస్ … నాడు వుమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయంలోని కిరణ్ కుమార్ రెడ్డి , రోశయ్య ప్రభుత్వాలు ఇంత కుట్రగా వ్యవహరించి వుంటే కేసీఆర్ ఇంటి గడప దాటేవారా? కేటీఆర్ అడుగు బయటపెట్టేవాడా ? మిలియన్ మార్చ్, వంటావార్పు, రైల్ రోకో, రహదారి దిగ్బంధన .. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ సహకారం లేకపోతే జరిగేవా ? ఈనాడు ఒక ర్యాలీకి పర్మిషన్ ఇవ్వకుండా తిరిగి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టాలనుకోవడం ఎంతవరకూ న్యాయం” అని నిలదీశారు దాసోజు.
పోలీసులకు సూటి ప్రశ్న. కాంగ్రెస్ నాయకులపై కేసులు పెడుతున్నారు సరే.. తెలంగాణ లో నేడు చాలామంది భూకబ్జాలకు పాల్పడుతున్నారు. ప్రైవేట్ భూములని కూడా దోచేస్తూ గుండాగిరి చేస్తున్నారు.. దమ్ము, ధైర్యం వుంటే వీరి మీద కేసులు పెట్టండి. అంతేకానీ కేవలం కాంగ్రెస్ పార్టీని అణిచేయాలనే ధోరణిలో వ్యవహరించడం అనైతికం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని రెచ్చగొట్టడం సరికాదు. రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసి పరిస్థితి వస్తుంది. మేము ప్రజాస్వామ్య పద్దతిలో వెళ్తున్నాం. ర్యాలీకి పర్మిషన్ అడిగాం. న్యాయపరంగా ఇవ్వకుండా కుట్ర చేసి మళ్ళీ కేసులు పెట్టడం ఏం న్యాయం ” అని ప్రశ్నించారు దాసోజు.
పోలీసులు పాలెగాళ్ళలా వ్యవహరించడం మానుకోవాలి. మంత్రి మల్లా రెడ్డిని ఓ కార్యక్రమంలో వుంటే ఒక రైతు వచ్చి మల్లా రెడ్డి తన భూమి కబ్జా చేశాడని ఆరోపించి ఫిర్యాదు చేస్తే దానికి పై కేసు లేదు. ముత్తిరెడ్డి యాది రెడ్డి, మైపాల్ రెడ్డి, గంగుల కమలాకర్ , పువ్వాడ అజయ్ , శ్రీనివాస్ గౌడ్ , గొంగిడి సునీత, మహిపాల్ రెడ్డి … అనేక మంది టీఆర్ఎస్ నాయకులపై
కబ్జా , అక్రమ ఆరోపణలు వున్నాయి. వీరి ఎవరిమీద కేసు పెట్టే దమ్ము పోలీసులకు లేదు. కానీ కేసీఆర్ పాలెగాళ్ళ మాదిరి కాంగ్రెస్ నాయకుల పై కేసు అంటే మాత్రం సిద్దమైపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దుర్మార్గం తగదు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని కాపలాదారుగా వుండాలి కానీ కేసీఆర్ కి కాదు”అని పేర్కొన్నారు దాసోజు.
ట్రాఫిక్ నిబంధనలు మాట్లాడుతున్న పోలీసులు … కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఫాం హౌస్ వెళ్లడాని ఆయన మొదలు కాక గంట ముందే మొత్తం బేగంపేట నుండి యల్లారెడ్డి వరకూ ట్రాఫిక్ ని నిలిపెస్తున్నారు . ప్రజలు గంటల కొద్ది రోడ్ల మీద నిలిచిపోయే పరిస్థితి. నిజంగా పోలీసులకు, ప్రభుత్వానికి ట్రాఫిక్ సమస్య సొయి వున్నట్లయితే ముఖ్యమంత్రి కాన్వాయ్ ని రద్దు చేయాలి. కేటీఆర్ వెళ్ళిన ఒక ముఖ్యమంత్రికి వుండే హడావిడి చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలకు ఇబ్బంది కాదా ? లాక్ డౌన్ , కర్ఫ్యూ అమలు వున్న సమయంలో కేటీఆర్, సబితా ఇంద్రా రెడ్డి, చీఫ్ సెక్రటరీ, డిజీపీ.. అనేక కార్యక్రమాల్లో పాల్గొని హడావిడి చేశారు. వీరేవరికి ట్రాఫిక్, లాక్ డౌన్ రూల్స్ వర్తించవా ? కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకే రూల్స్ పెడతారా ? వాసాలమర్రి కేసీఆర్ ఏం చేశారు ? లాక్ డౌన్ సమయంలో పెళ్లికి యాబై మంది కంటే ఎక్కువ వద్దని రూల్ పెట్టారు. మరి వాసాలమర్రిలో ఐదు వేలమందితో కేసీఆర్ సహపంక్తి భోజనం చేస్తే … డిజీపీ కేసు ఎందుకు పెట్టలేదు ? అని నిలదీశారు దాసోజు.
”టీఆర్ఎస్ పతనం మొదలైయింది. కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది. ఈ సంగతి పోలీసులు కూడా గుర్తు పెట్టుకోవాలి. ప్రగతి భవన్ కోట గోడలు కూలుతున్నాయి. అసెంబ్లీపై కాంగ్రెస్ జెండా ఎగురుతుంది” అని ధీమా వ్యక్తం చేశారు దాసోజు.