గాలిలో విమానం పైలట్ కు కరోనా చివరకు ఏం చేశారంటే

గాలిలో విమానం పైలట్ కు కరోనా చివరకు ఏం చేశారంటే

0
105

భారతీయులు ఈ లాక్ డౌన్ వేళ ఇతర దేశాల్లో చాలా మంది చిక్కుకుపోయారు, ఇలాంటి వారిని మన దేశానికి తీసుకువచ్చేందుకు వందేభారత్ మిషన్ చేపడుతోంది కేంద్రం, ఇందులో భాగంగా రోజూ పదుల సంఖ్యలో విమానాలు వస్తున్నాయి, వారిని క్వారంటైన్ కి తరలిస్తున్నారు,ప్రత్యేకంగా వారికి టెస్టులు చేస్తున్నారు.

తాజాగా ఈరోజు రష్యాలో చిక్కుకున్న భారతీయులని తీసుకువచ్చేందుకు..ఢిల్లీ నుంచి రష్యా రాజధాని మాస్కోకు బయలుదేరింది ఎయిరిండియా AI-1945 విమానం, అయితే ఈ పైలట్ కు వైరస్ పాజిటీవ్ అని తర్వాత రెండోసారి రిపోర్టులు చెక్ చేసే సమయంలో గ్రౌండ్ లెవల్ సిబ్బంది గుర్తించారు.

అప్పటికే పైలట్ చాలా దూరం వెళ్లాడు, కాని వెంటనే అతనికి సమాచారం ఇచ్చి, ఆ విమానం మళ్లీ దిల్లీకి రప్పించారు, వెంటనే అతనికి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు, రసాయనాలతో ఈ విమానం శుభ్రం చేశారు, మరో విమానం సిబ్బందితో కలిపి మాస్కోకి పంపించారు. ఇది సిబ్బంది తప్పిదం రిపోర్టులు చూసుకోకపోవడం వల్ల వచ్చింది అని తేల్చారు.