ఎయిర్ టెల్ సంచలన నిర్ణయం ఇక ఆ సేవలు ఉండవు

ఎయిర్ టెల్ సంచలన నిర్ణయం ఇక ఆ సేవలు ఉండవు

0
76

టెలికం కంపెనీలు హెవీ కాంపిటీషన్ ఎదురుకొంటున్నాయి. జియో రాకతో మిగిలిన కంపెనీలకు లాభాలు కాదు కదా అసలు కంపెనీలు నడపడానికే ఇబ్బంది వస్తోంది..అత్యంత చౌక చార్జీలు, భారీ స్థాయిలో వినియోగం.. అన్నీ కలిసి టెలికం పరిశ్రమను కోలుకోలేనంతగా కుదేలెత్తిస్తున్నాయని టెల్కో దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ చీఫ్‌ సునీల్‌ భారతీ మిట్టల్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

వెంటనే దీనిపై ట్రాయ్ నిర్ణయం తీసుకోవాలి అని అన్నారు. డేటా, వాయిస్, ఇతర సర్వీసులకు కలిపి నెలకు ఒకో యూజరు కనిష్టంగా రూ.100, గరిష్టంగా రూ.450–500 దాకా చెల్లించవచ్చని అంచనా వేస్తున్నారు అలాగే ప్రపంచంలోనే అత్యంత చౌక టారిఫ్‌లు మనవే అని అంటున్నారు వ్యాపారులు.

. డేటా వినియోగం మాత్రం మిగతా దేశాలతో పోలిస్తే రెండు, మూడు రెట్లు ఎక్కువగా మన దేశంలో ఉందట..ఎయిర్‌టెల్‌ క్రమంగా 3జీ సేవలను ఉపసంహరిస్తోంది. ఇందులో భాగంగా ముందుగా కర్ణాటకలో 3జీ నెట్‌వర్క్‌ను నిలిపివేసినట్లు కంపెనీ తెలిపింది.హై స్పీడ్‌ 4జీ నెట్‌వర్క్‌పై అందిస్తామని తెలిపింది.