పర్యాటక శాఖ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఇంటిదగ్గర ఏపీ పోలీసులు నానా హంగామా చేశారు… ఆమె భర్త భార్గవ రామ్ ను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ లో ఉన్న నివాసానికి ఏపీ పోలీసులు వచ్చారు.. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది…
పోలీసులు ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా తమ ఇంట్లోకి ఎలా వస్తారని అఖిల ప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు… ఈ క్రమంలో పోలీసులకు అఖిల ప్రియ మధ్యవాగ్వావాదం చోటు చేసుకుంది… దీంతో పోలీసులు పక్కింటికి వెళ్లి అక్కడ నుంచి అఖిల ప్రియ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించి భార్గవ్ ను అదుపులోకి తీసుకోవాలని చేశారు.
ఈ క్రమంలో ఇంట్లో ఉన్న వస్తువులు పగిలిపోయాయి… దీనిపై అఖిల ప్రియ మండిపడ్డారు. కర్నూల్ ఎస్పీ ఈ కేసును వ్యక్తి గతంగా తీసుకుని చట్టవిరుద్దంగా అరెస్ట్ లు చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు… కాగా భార్గవ రాం కు క్రషర్ లో భాగం ఉందని అఖిల ప్రియ చెప్పిన సంగతి తెలిసిందే.