అక్కడ మరో 15 రోజులు లాక్ డౌన్ తప్పదా ?

అక్కడ మరో 15 రోజులు లాక్ డౌన్ తప్పదా ?

0
86

దేశంలో రోజుకి మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి… ఏకంగా అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదు అవుతున్నాయి… ఇప్పటికే ఆర్దిక రాజధాని ముంబై పూర్తిగా లాక్ డౌన్ లో ఉంది, వ్యాపారాలు ఆగిపోయాయి.

 

 

కరోనాను కట్టడి చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30 వరకు లాక్ డౌన్ ను విధించింది. అయినా కేసులు కట్టడి కాకపోతే దాదాపు మరో 15 రోజులు లాక్ డౌన్ పొడిగించే ఆలోచనలో ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

 

 

నిపుణులు అదే చెబుతున్నారు మే 15 వరకు మహారాష్ట్రలో లాక్ డౌన్ ఉంటే మంచిది అని చెబుతున్నారు, దీనివల్ల కేసులు తీవ్రత తగ్గుతుంది అని చెబుతున్నారు, సొంతంగానే వ్యాపారులు చాలా మంది వ్యాపారాలు మూసేస్తున్నారు.రేపటి లోగా లాక్ డౌన్ కొనసాగించడంపై ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది.

 

ఇక్కడ కేసులు చూస్తే గతంలో రోజువారీ కొత్త కేసుల సంఖ్య 70 వేలను దాటేదని… ఇప్పుడు 60 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ప్రజలు మాస్క్ ధరించి మార్కెట్ కి వస్తున్నారు.