యావత్ ప్రపంచం ఈ కోవిడ్ తో బాధపడుతోంది.. ఈ సమయంలో చైనా ముందు అత్యంత కీలకంగా అక్కడ రెండు నెలలు పైగా లాక్ డౌన్ విధించారు.. వుహన్ సిటీ పూర్తిగా రెండు నెలలు అసలు బయట ప్రపంచం చూడలేదు.. రవాణా వ్యవస్ధ మొత్తం ఆపేశారు, ఇలా రెండు నెలలు లాక్ డౌన్ విధించారు అయితే ఇప్పుడిప్పుడే ఈ వైరస్ అక్కడ తగ్గుముఖం పట్టింది.
వైరస్ సృష్టించిన విలయం నుంచి చైనా మెల్లమెల్లగా కోలుకుంటోంది. కరోనా పుట్టిల్లు వూహాన్‌లో కూడా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఫ్రిబ్రవరి నుంచి పెద్దగా స్కూళ్లు తెరవలేదు ..కాని తాజాగా ఇప్పుడు స్కూళ్లు తెరచుకున్నాయి. ఇక పిల్లలు లక్షలాది మంది స్కూళ్లకు చేరుకుంటున్నారు.
కాని పూర్తిగా సామాజిక దూరం పాటిస్తున్నారు, అంతేకాదు శానిటైజర్లు బ్యాగుల్లో పెట్టుకుంటున్నారు.. పక్క పక్కన కాకుండా గ్యాప్ ఇస్తూ కూర్చుంటున్నారు. ఇక కొందరు గ్లౌజులు పెట్టుకుంటున్నారు.. అందరూ మాస్కులు ధరిస్తున్నారు.. స్కూలులో హ్యాండ్ వాష్ శానిటైజర్లు పూర్తిగా అందరికి అందుబాటులో ఉంచారు, పూర్తిగా ఇక్కడ స్కూల్లలో గతంలో కంటే మార్పులు వచ్చాయి.