ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ చొర‌వ‌తో చిన్నారి అక్ష‌య సేఫ్

Akshaya Safe with the initiative of Minister Shri KTR as a Twitter platform

0
114

హైద‌రాబాద్ : సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌ మండలం సింగితం గ్రామానికి చెందిన అవినాష్‌, సుమలత దంపతుల చిన్న కూతురు అక్షయ(2). గొంతు చుట్టు ఏర్ప‌డ్డ క‌ణితితో తీవ్రంగా బాధ‌ప‌డుతోంది. ఆపరేషన్‌ చేయించేందుకు స్థోమత లేక‌పోవ‌డంతో విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువ‌చ్చారు. సానుకూలంగా స్పందించిన మంత్రి స‌ర్జ‌రీకి హామీ ఇచ్చారు.

పాప ఫోటో చూస్తూనే చాలా బాధ‌పడ్డ‌ట్లు కేటీఆర్ తెలిపారు. ఎలా భ‌రిస్తుందో ఆ చిన్నారి అని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. విష‌యాన్ని త‌న దృష్టికి తీసుకువ‌చ్చినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. స‌మ‌స్య‌ను వ్యక్తిగతంగా తీసుకుని ప‌రిష్క‌రించ‌నున్న‌ట్లు ట్విట్ చేసినప్పుడే కేటిఆర్ వెల్ల‌డించారు.

ఇచ్చిన వాగ్దానం మేర‌కు పాప‌కు స‌ర్జ‌రీ విజ‌యంతంగా పూర్తైన‌ట్లు మంత్రి కేటీఆర్ శుక్ర‌వారం ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. చికిత్స అనంత‌రం పూర్తిగా కోలుకొని ఇంటికి వెళ్లిన పాప చిరున‌వ్వు మొఖాన్ని కేటీఆర్ పంచుకున్నారు. పాప ఇప్పుడు తల్లిదండ్రులతో ఇంటికి తిరిగి చేరుకున్న‌ట్లు చెప్పారు. చిన్నారి చాలా వేగంగా కోలుకోవ‌డం ఆనందంగా ఉందని మంత్రి కేటీఆర్  పేర్కొన్నారు.