ఈ ఎడారి మిడతలు ఎవరికి నిద్ర ఉండనివ్వడం లేదు… రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, మరీ ముఖ్యంగా పంటలపై పడి ఇష్టం వచ్చిన రీతిన అవి తినేస్తున్నాయి. ఇప్పటికే అవి తెలంగాణ సరిహద్దుకు చేరుకునేందుకు సిద్దంగా ఉన్నాయి అని వార్తలు వచ్చాయి.
ఆదిలాబాద్ మహరాష్ట్ర బోర్డర్ దగ్గర రైతులు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు, కాని తాజాగా ఇవి మన పక్క స్టేట్ ఒడిశాపై దాడి మొదలుపెట్టడానికి సిద్దంగా ఉన్నాయట..దీంతో 9 జిల్లాలను అప్రమత్తం చేసింది ఒడిశా ప్రభుత్వం ..మిడతలు దాడి చేసే అవకాశం ఉందని తెలిపింది
ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ సరిహద్దుల్లోని ఈ జిల్లాల్లో మిడతల దాడికి అవకాశం ఉందనీ, పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపింది. ఈమిడతలపై క్రిమిసంహారక మందులు పిచికారి చేస్తున్నారు, దీని కోసం టెండర్లు పిలవనున్నారు, రైతులు అలర్ట్ అయ్యారు ఆ ప్రాంతాల్లో.