అలర్ట్..సైబర్‌ క్రైం టోల్‌ఫ్రీం నంబర్‌ మార్పు

0
267

ఇటీివల కాలంలో నేరాల తీరు మారింది. ఇళ్లల్లో చోరీలు కాదు ఏకంగా బ్యాంకు ఖాతాలోకి దూరి నగదు దొంగలిస్తున్నారు. సైబర్ నేరాలు పెరిగిపోయాయి. ఓటీటీ ఫ్రాడ్స్, అకౌంట్ హ్యాకింగ్, లాటరీ ఫ్రాడ్స్ ఎక్కువ అయ్యాయి. వీటిపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు, పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుంది. పోలీస్ శాఖ ప్రత్యేకంగా సైబర్ సెల్ ఏర్పాటు చేసి సైబర్ నేరాలను దర్యాప్తు చేస్తోంది.

సైబర్ నేరాలపై కేంద్ర హోం శాఖ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న టోల్ ఫ్రి నెంబర్ ని మార్చింది. గతంలో 155260గా టోల్ ఫ్రీ నెంబర్ ఉండేది. అయితే ఈ నెంబర్ అసౌకర్యంగా ఉందంటూ.. చాలా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కొత్తగా ‘1930’ ని కొత్త టోల్ ఫ్రీ నెంబర్ ను తీసుకువచ్చింది. హోం శాఖ మంత్రిత్వ శాఖ అధికారులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీస్ విభాగాలతో, ఐటీ నిపుణులతో చర్చించి 1930ని టోల్ ఫ్రీ నెంబర్ గా ఫిక్స్ చేశారు.

రెండు, మూడురోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో ఈ నంబరును ప్రచారం చేస్తున్నారు. కొందరు బాధితులు సోమవారం 155260 నంబరుకు ఫిర్యాదు చేయగా కొత్త నంబరుకు చేయాలని సూచించారు. కేంద్రహోంమంత్రిత్వ శాఖ నిర్ణయంతో 155260గా ఉన్న నంబరు ఇకపై 1930గా కొనసాగనుంది.