పరీక్షలు రాసే అభ్యర్థులకు అలెర్ట్..నేడు హైదరాబాద్ లో పలు MMTS రైళ్లు రద్దు

0
118

ఏపీ టెట్, RRB పరీక్ష రాసే అభ్యర్థులకు అలెర్ట్, నేడు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో పలు MMTS రైళ్లను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. సాంకేతిక పరమైన సమస్యలతో ఈ నిర్ణయం తీసుకున్నామని, పరీక్ష రాసే అభ్యర్థులు ఈ విషయాన్నీ గమనించాలని రైల్వే అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

లింగంపల్లి-హైదరాబాద్ రూట్‌లో 9 సర్వీసులు రద్దు కాగా.. హైదరాబాద్-లింగంపల్లి రూట్‌లోనూ 9 సర్వీసులు రద్దయ్యాయి.

ఫలక్‌నుమా-లింగంపల్లి రూట్‌లో 7 సర్వీసులు రద్దు అయ్యాయి.

లింగంపల్లి-ఫలక్​నుమా రూట్‌లో 7 సర్వీసులు రద్దు చేశారు.

లింగంపల్లి – సికింద్రాబాద్, సికింద్రాబాద్-లింగంపల్లి రూట్‌లో ఒక్కో సర్వీసు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే పేర్కొంది.

కాగా, సెలవు రోజు వస్తే చాలు ఏదో ఒక కారణం చెప్పి ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేస్తున్నారని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.