ఇంటర్ విద్యార్థులకు అలర్ట్..పరీక్షలు వాయిదా..కారణం ఇదే!

0
109

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్‌. ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ మళ్లీ వాయిదా పడనున్నాయి. అయితే..కొన్ని పరీక్షలే వాయిదా పడతాయా? లేక అన్ని ఎగ్జామ్స్ వాయిదా పడతాయా? అన్న విషయంపై బోర్డు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. నిన్న మంగళవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్ ఎగ్జామ్ కు సంబంధించిన తేదీలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్ ఎగ్జామ్స్ తేదీలలో ఈ మార్పులు చేయాల్సి వస్తుంది.

ఒకే తేదీల్లో ఇంటర్‌ పరీక్షలు, జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు జరుగనున్నాయి. దీంతో ఏపీ ఇంటర్‌ బోర్డు అధికారులు పరీక్షల షెడ్యూల్‌ ను మార్చాలని ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే.. దేశ వ్యాప్తంగా.. నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ తేదీలను మార్చేందుకు అవకాశం లేదు. కాబట్టి ఏపీ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ ను అధికారులు మార్చాల్సి ఉంటుంది.  ఇంటర్ బోర్డ్ గతంలో వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం.. ఇంటర్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 28 వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే జేఈఈ ఎగ్జామ్స్ ను ఏప్రిల్ 16 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్లు నిన్న విడుదల చేసిన ప్రకటనలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది.

దీంతో జేఈఈ మెయిన్ మొదటి విడత జరిగే 16న ఇంటర్ సెకండియర్ మాథ్స్, బోటనీ, 19న మాథ్స్-2బీ, జువాలజీ, హిస్టరీ తదితర పరీక్షలు ఉండనున్నాయి. అయితే జేఈఈ మెయిన్ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు రెండు షిష్ట్ లలో నిర్వహిస్తారు. ఇంటర్ ఎగ్జామ్స్ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఉంటాయి. అయితే ఆ రెండు తేదీల్లో విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దీంతో ఇంటర్ బోర్డ్ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. ఆ రెండు తేదీల్లో మాత్రమే ఎగ్జామ్స్ ను వాయిదా వేస్తారా? లేక మొత్తం ఎగ్జామ్స్ ను రీ షెడ్యూల్ చేయాలా? అన్న అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.