ప్రయాణికులకు అలెర్ట్..ఆర్టీసీలో కొత్త రూల్స్..ఆదేశాలు జారీ చేసిన సజ్జనార్

Alert for passengers..New Rules in RTC..Sajjanar who issued orders

0
93

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మనదేశంలోనూ పంజా విసురుతోంది. ఇప్పటికే దేశంలో నాలుగు కేసులు వెలుగుచూశాయి. దీంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

ముందస్తు చర్యల్లో భాగంగా కొత్త నిబంధనలు సిద్ధం చేశారు. నూతన రూల్స్‌కు సంబంధించిన ఉత్తర్వులను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విడుదల చేశారు. ఈ నూతన నిబంధనల మేరకు బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు మాస్క్ తప్పని సరి చేశారు. మాస్స్ ఉంటేనే బస్సులోకి ఎంట్రీ చేయనున్నారు. కండక్టర్ తో పాటు డ్రైవర్ కూడా తప్పని సరిగా మాస్క్ ధరించాలని అందులో పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సులను బస్సుని శానిటైజ్ చేయడంతో పాటు శానిటైజర్ బాటిళ్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తిపై అన్ని బస్టాండ్‌లు, బస్‌ స్టాప్‌లలో మైక్ లతో ప్రయాణికులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.