పీఎం కిసాన్ రైతులకు అలర్ట్..తప్పనిసరి ఇలా చేయండి!

0
45

రైతుల కోసం కేంద్రం ఎన్నో రకాల పథకాలను తీసుకొచ్చింది. వాటిలో ప్రత్యేకంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు మేలు చేస్తుంది. అయితే పీఎం కిసాన్ స్కీమ్‌కు సంబంధించిన నియమ నిబంధనలు తెలియక రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఆ నిబంధనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పీఎం కిసాన్ స్కీమ్‌లో రిజిస్టర్ అయిన రైతులు తప్పనిసరిగా ఇ-కేవైసీ చేయించాలి. ఇ-కేవైసీ చేయించక పోతే వారి అకౌంట్‌లోకి స్కీమ్ ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చే అవకాశం ఉండదు. కనుక రైతులు తప్పకుండ ఇ-కేవైసీ ద్వారా వివరాలన్నీ అప్‌డేట్ చేయించాలి. ఆధార్ బేస్డ్ ఇ-కేవైసీ చేయించాలంటే ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ తప్పనిసరిగా లింక్ చేయాలి. ఆధార్ నెంబర్‌కు ఏ మొబైల్ నెంబర్ లింక్ ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు చూద్దాం.

  • ఇ-కేవైసీ చేయించాలంటే ముందుగా పీఎం కిసాన్ స్కీమ్ అధికారిక వెబ్‌సైట్
  • https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి.
  • నెక్స్ట్ మీకు హోమ్ పేజీలో eKYC ఆప్షన్ కనిపిస్తుంది.
  • ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
  • ఆ తరవాత మీరు ఆధార్ కార్డ్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి.
  • మీ ఆధార్ కార్డుకు లింకైన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాత Get OTP ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
  • ఆ తరవాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి.
  • అంతే ఇ-కేవైసీ సబ్మిట్ అవుతుంది.