Alert: రేషన్ కార్డు దారులకు అలెర్ట్..సర్కార్ కీలక నిర్ణయం

0
95

రేషన్ కార్డు దారులకు అలెర్ట్..తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బయోమెట్రిక్‌ విధానంలోనే రేషన్‌ కార్డు బియ్యం పంపిణీ చేయాలని కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

కరోనా మహమ్మారి ప్రభావంతో రెండేళ్ల కిందట బయో మెట్రిక్‌ విధానాన్ని నిలుపుదల చేశారు. అప్పటి నుండి ఓటీపీ ఆధారంగా రేషన్‌ కార్డు బియ్యాన్ని పంపిణీ చేసింది. ప్రస్తుతం కరోనా థర్డ్‌ వేవ్‌ కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఇక ఓటీపీ విధానానికి స్వస్తి చెప్పి పాత విధానాన్నే అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఓటీపీ విధానంలో రేషన్‌ బియ్యం దుర్వినియోగం అవుతున్నాయని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ తీర్మానం కూడా చేయడంతో..బయోమెట్రిక్‌ విధానాన్ని మళ్లీ ఆచరణలో పెట్టాలని కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు కరోనా కష్టకాలంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభమైంది. గతేడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు యూనిట్‌కు 12 కిలోల చొప్పున, ఆ తర్వాత జూలై నుంచి ఆగస్టు వరకు యూనిట్‌కు 10 కిలోల చొప్పున పంపిణీ చేశారు. సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో మొదటగా ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు  ఉచిత బియ్యం పంపిణీ చేయాలని భావించినా.. కరోనా సంక్షోభం వెంటాడుతుండటంతో నవంబరు వరకు గడువు పొడిగించారు. తాజాగా మరో నాలుగు నెలల వరకు పొడిగించారు.