Breaking: విద్యార్థులకు అలర్ట్..ఆ పరీక్షలు రీ-షెడ్యూల్‌

0
74

ఏపీ ఇంటర్‌ పరీక్షలు రీ షెడ్యూల్‌ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ పరీక్షల షెడ్యూలును విడుదల చేసిందని చెప్పిన ఆయన… ఐఐటీలకు 16 ఏప్రిల్ నుంచి 21 ఏప్రిల్ వరకు పరీక్షలు కోసం ఇంటర్ పరీక్షలు వాయిదా వేశామని స్పష్టం చేశారు. దీనితో ఏప్రిల్‌ మాసం 22వ తేదీ నుంచి.. మే 12వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయి.