విద్యార్థులకు అలర్ట్. ఏపీలో నేడు పాఠశాలల పునః ప్రారంభం

0
133

విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఏపీలో నేడు పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, ‘నాడు-నేడు’ పనులు, విద్యా కానుక కిట్ల సరఫరా సరిగా లేకపోవడంతో పాఠశాలల పునఃప్రారంభాన్ని జులైకి వాయిదా వేశారు. అయితే ఈ ఏడాది పాఠశాలలు తెరవడానికి 22 రోజులు అదనంగా సమయం లభించినా.. ఇంకా పూర్తి స్థాయిలో బడులకు పాఠ్యపుస్తకాలు, విద్యా కానుక సామగ్రి మాత్రం చేరకపోవడం గమనార్హం.

విద్యార్థులు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు, బూట్లు లేకుండానే బడులకు రావాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏపీ వ్యాప్తంగా 1-10 తరగతి వరకు 330 రకాల టైటిళ్లను 3.38 కోట్లు అందించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు క్షేత్రస్థాయికి 70శాతం చేరాయి. ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకాలు ఇప్పటికీ చేరలేదు. ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా 47.40 లక్షల మంది విద్యార్థులకు అందించాల్సిన బూట్లు, ఏకరూప దుస్తులు 30శాతం మాత్రమే సరఫరా అయ్యాయి.

ఇవాళ సీఎం జగన్ కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం 10.20 నుంచి 10.30 వరకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో వినతిపత్రాలు తీసుకోనున్న సీఎం… 10.45 నుంచి 10.50 వరకు మున్సిపల్ స్కూల్ ను సందర్శించనున్నారు.10.55 నుంచి 11.15 వరకు నాయకులు, అధికారులను కలవనున్న సీఎం… సభలో విద్యార్థులకు విద్యా కానుక పంపిణీ చేసి ప్రసంగిస్తారు.