Flash: తెలంగాణ విద్యార్థులకు అలర్ట్‌..పరీక్షలు వాయిదా

0
80

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలకు కేవలం వారం రోజుల ముందుగా షెడ్యూల్‌ విడుదల చేయడంపై విమర్శలు రావడంతో ఈ నెల ఏడో తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన 1 నుంచి 9 వ తరగతి సమ్మేటివ్ అసెస్ మెంట్-2 పరీక్షలు వాయిదా పడ్డాయి. దాంతో ఈ నెల 16 నుంచి 22 వరకు పరీక్షలు జరుగుతాయంటూ గత రాత్రి విద్యాశాఖ కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది.