ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) టర్మ్-1 బోర్డు పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఓఎమ్మార్ విధానంలో CBSE ఈ పరీక్షలను నిర్వహించనుంది. ఓఎమ్మార్ షీట్లలో బబుల్స్‌ను ఫిల్ చేయడానికి విద్యార్థులు బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను తీసుకుని రావాలని CBSE అధికారులు తెలిపారు.
విద్యార్థులు పరీక్ష హాల్‌కు తప్పనిసరిగా CBSE టర్మ్-1 అడ్మిట్ కార్డు తీసుకుని రావాలని సూచించారు. ఒకవేళ విద్యార్థులు ఏదైనా బబుల్‌ను తప్పుగా ఫిల్ చేసి ఉంటే..ఆ నాలుగు సర్కిళ్లకు ముందు ఇచ్చిన బాక్స్‌లో కరెక్ట్ జవాబు రాయవచ్చని పరీక్ష నిర్వాహకులు తెలిపారు.
అయితే ఆ బాక్సును రబ్బింగ్ చేయకూడదని, అందులో ఎ, బి, సి, డి ఆప్షన్‌లలో ఏది కరెక్టు అయితే ఆ లెటర్‌ను రాయాలని సూచించారు. విద్యార్థులు బాక్సులో రాసిన జవాబునే CBSE తుది జవాబుగా పరిగణిస్తుందని చెప్పారు.