అలర్ట్ – గోవా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా అయితే ఇది తెలుసుకోండి

అలర్ట్ - గోవా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా అయితే ఇది తెలుసుకోండి

0
88

దేశంలో కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి.. రోజుకి మూడు లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి.. అన్నీ రాష్ట్రాల్లో పరిస్దితి ఇలాగే ఉంది… అయితే చాలా చోట్ల ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అలాగే లాక్ డౌన్ కూడా విధించారు… ఇక వారాంతపు లాక్ డౌన్ విధిస్తున్నారు…అయితే తాజాగా గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

 

కరోనా పాజిటీవ్ కేసులు వేగంగా పెరుగుతుండటంతో గోవా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కంప్లీట్ లాక్డౌన్ విధించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 29 రాత్రి ఏడు గంటల నుంచి మే 3న ఉదయం వరకు కంప్లీట్ లాక్డౌన్ అమల్లో ఉంటుందని తెలిపారు, కేవలం అత్యవసరం అయిన సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

 

వివిధ పరిశ్రమలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. ఇక వస్తువులు రవాణా అంతరాష్ట్రంగా చేసుకోవచ్చు, ప్రజా రవాణా మాత్రం ఆపేస్తున్నారు క్యాషినోలు, హోటళ్లు, పబ్లు కూడా మూసే ఉంటాయని చెప్పారు.