కారులో బైక్ లో మీ వాహనంలో ప్రయాణం చేస్తున్న సమయంలో మీరు తాగి వాహనం నడిపితే కచ్చితంగా శిక్షకు గురి అవుతారు, డ్రంకెన్ డ్రైవ్లో మద్యం తాగి వాహనం నడుపుతున్న వారిని పోలీసులు పట్టుకుంటారు అనేది తెలిసిందే.. అయితే ఇలాంటి కేసుల్లో మరింత కఠినంగా వ్యవహరించనున్నారు పోలీసులు.
ఇప్పటి వరకూ తాగి బైక్ కారు నడిపే వారిపై కేసులు పెడుతున్నారు ఇక అలాంటి వారి పక్కన కారులో బైక్ లో వాహనాల్లో కూర్చున్న వారిపై కూడా కేసులు పెడతారు, ఎందుకు అంటే డ్రైవర్ మద్యం తాగి వాహనం నడుపుతున్న విషయం తెలిసీ అందులో ప్రయాణించడం నేరమని తెలియచేస్తున్నారు.
దీనిపై పోలీసులు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు… అది ఏమిటి అంటే మీ డ్రైవర్, లేదంటే మీ స్నేహితుడు పరిమితికి మించి మద్యం తాగి కారు నడుపుతున్నాడా— పక్క సీట్లో మీరు కూడా ఉన్నారా—- పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే జైలుకు వెళ్లక తప్పదు. సో తాగిన వారితో పాటు పక్కన ఉన్న వారిపై కూడా కేసు నమోదు చేస్తారు, సో ఇలా కారు నడిపే వ్యక్తి తాగి ఉంటే ఆ వాహనంలో ప్రయాణం చేయడం సేఫ్ కాదు.
|
|
అలర్ట్ – మీ వాహనం డ్రైవర్ తాగినా మీకు శిక్ష ఈ కొత్త రూల్ తెలుసుకోండి
-